₹ 50
ఇంతదాకా నేను వెలువరించిన కవితాసంపుటాల్లో ఇది ఆరవది. గత నాలుగు సవత్సరాలుగు రాస్తూ వచ్చిన కవితలు ఇందులో ఉన్నాయి. ఈ ఆరు సంపుటాల్లోనూ చివరి నాలుగు సంపుటాలూ నా నగర జీవితంలోంచి వచ్చిన కవిత్వమే. ఈ కవితాల్నిట్లా ఏరికూర్చుతుంటూ ఉంటె, పూర్వకాలపు చైనా సామెత ఒకటి గుర్తొస్తుంది." చిన్నపాటి పరివ్రాజకుడు కొండల్లో తిరుగుతాడు, సర్వ సంగపరిత్యాగి నగరంలో జీవిస్తాడు" అని. అవును. ఈ ఇరవయ్యేళ్లుగా నేను ప్రాపంచికపరాజయాన్ని అభ్యసిస్తూ పూర్తిపరివ్రాజకుడుగా జీవించడమెట్లనో సాధనచేస్తూనే ఉన్ననుకుంటున్నాను.
రాజముండ్రి రోజుల్లో నా మిత్రుడు, తర్వాతి రోజుల్లో ఒక పరివ్రాజకుడిగా ఇల్లు వదిలివెళ్ళిపోయిన కవులూరి గోపీచంద్ ఒక మాట అంటుండే వాడు కవిత్వం భౌతిక విజయసాధనం కాదని. ఇది నేటి సాహిత్యయుగధర్మానికి పూర్తి విరుద్ధ వాక్యం.
-వాడ్రేవు చినవీరభద్రదు.
- Title :Konda Mida Athithi
- Author :Vadrevu Chinaveerabhadrudu
- Publisher :Analpa Books Company
- ISBN :MANIMN0569
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :112
- Language :Telugu
- Availability :outofstock