₹ 100
నా లోపలి ప్రయాణానికి ఎందరో మహాకవులు, గొప్ప రచయితలు ఎంతో సహాయం చేశారు. అతి సాధారణమైన తమ జీవన విధానంతో ప్రభావితం చేసిన మామూలు మనుషులున్నారు. కొత్త సిద్ధాంతాలను కనుగొన్నవారున్నారు.
కొందరిని చూసి జీవితం అంటే ఏమిటో గ్రహించాను. మరికొందరిని చూసి ఎలా జీవించకూడదో తెలుసుకున్నాను. చివరికి ఈ ప్రయాణం నన్ను ఎక్కడికి చేర్చింది అని ఈ రోజు ఆలోచించుకుంటే తిరుగుడు మెట్లలాగ నన్ను నా బాల్య జీవన తరుచ్ఛయాల్లోకే తీసుకువెళ్తోందని అర్థమయింది. అది నా చుట్టూ నా కోసం, నా వారందరి కోసం, ఈ ప్రపంచమంతా నాదైన నవారందరి కోసం నేను నిర్మించుకోవలసిన ఒక మానవీయ లోకం.
ఆ లోకంలో అసమానతలు ఉండవు. వాటికి కారణమయిన వర్ణాలు, వర్గాలూ, లింగబేధాలు పోతాయి. ప్రేమ అనబడే దయా పారావతాలు ఎగురుతూ ఉంటాయి.
- వాడ్రేవు వీరలక్ష్మీ దేవి
- Title :Konda Phalam
- Author :Vadrevu Veeralakshmi Devi
- Publisher :Sri Prachurana
- ISBN :MANIMN0464
- Binding :Paperback
- Published Date :2010
- Number Of Pages :144
- Language :Telugu
- Availability :outofstock