కేంద్ర ఆర్గనైజింగు కమిటీ, కమ్యూనిస్టు పార్టీ (మా-లె) ప్రకటనపై కేంద్రకమిటీ సభ్యుని వివరణ
భారత కమ్యూనిస్టు పార్టీ (మా-లె) కేంద్ర ఆర్గనైజింగ్ కమిటీ 1974 ఫిబ్రవరిలో చేసిన ప్రకటన కొంచెం ఆలస్యంగా ఫ్రాంటియర్, పిలుపు, దక్కన్ క్రానికల్ వగైరా పత్రికలలో ప్రచురితమయింది. ఆ ప్రకటన చదివిన కొంతమంది మిత్రులు వెల్లడించిన అభిప్రాయాల దృష్ట్యా యీ వివరణ అవసరమయింది. మొత్తం ప్రకటనలో వర్గ శత్రు నిర్మూలన గూర్చిన ప్రసక్తి లేకపోవడానికి కారణమేమిటి? పార్టీ ఆ అంశాన్ని వదులు కున్నదా? అనేది నాతో కలసిన వారందరూ ఏకగ్రీవంగా అడిగిన మొదటి ప్రశ్న. ఇలా ప్రశ్నించడమేగాక, ఆ అంశం అందులో లేకపోవడంపై వారు తమ అసంతృప్తిని సైతం వెల్లడించారు.
భారత ప్రజల ప్రియతమ నాయకుడు కామ్రేడ్ చారుమజుందార్ అమరుడైన తర్వాత వివిధ రాష్ట్రాలలోని పార్టీ కమిటీలకు ఒకరితో మరొకరికి సంబంధాలేర్పడ డానికి చాలాకాలం పట్టింది. అందువల్లనే ఎంతో ఆలస్యంగా గాని కేంద్రకమిటీ నిర్మాణం జరగలేదు. దానికితోడు గత ఆరు సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీ (మా-లె) నాయకత్వం కింద భారత దేశంలో నలుమూలలా కొనసాగిన సాయుధ రైతాంగ పోరాటం తాత్కాలికంగా వెనుకంజ వేయడంతో సిద్ధాంత రాజకీయ, నిర్మాణ విషయాలపై కొంత గందరగోళం...........................