• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Konni Shephalikalu

Konni Shephalikalu By Vadrevu Veeralakshmidevi

₹ 250

చలం చెప్పిన స్వేచ్ఛ

దాదాపు మూడేళ్ల క్రితం హైదరాబాద్లో 'రమణీ సె రమణాశ్రమ్ తక్' అనే పేరుతో హిందీలో రాసిన చలం గారి సంపూర్ణచరిత్ర పధ్నాలుగువందల పేజీల పుస్తకం తాలూకు ఆవిష్కరణ సభ జరిగింది.

ఆ సభలో మాట్లాడుతూ “ఇంతకాలం చలం చెప్పిన బయటి స్వేచ్ఛ గురించే మాట్లాడాం. ఇక లోపలి స్వేచ్ఛ గురించి మాట్లాడాలి. ఎందుకంటే లోపలి స్వేచ్ఛ లేని బయట స్వేచ్ఛ హాని చేస్తుంది” అన్నాను.

సభ పూర్తయ్యాక నన్ను ముగ్గురు నలుగురు ఆ లోపలిస్వేచ్ఛ అంటే ఏమిటని అడిగారు. వెంటనే నాకు చలంగారి 'శశాంక' నాటకం గుర్తొచ్చింది. చాలా కాలం నన్ను ఆలోచింపజేసి ఇప్పటికీ నా వెంట ఉండి నడిపించే మార్గదర్శకాల లాంటి పాత్రలున్న నాటకం అది. ఆ కథ, దానిలో కలగలిసిన ఆలోచనల గురించి కాస్త చెప్పుకుందాం.

తారాశశాంకమనే పురాణ కథను పెద్దగా మార్చకుండా అసలు అలాంటి కథలో అంతరార్థమేమయి ఉంటుందో చెప్పడానికి చలంగారు చేసిన ప్రయత్నమే ఈ నాటకం, ఇది నిరుపమానం.

రచన అంతా కవితాత్మకంగా ఉంటూనే ఆలోచనాత్మకంగా కూడా ఉంటుంది.

బృహస్పతి దేవగురువు. అతని భార్య తార. బృహస్పతి బుద్ధిశాలి, వివేకి. తారలోని రసస్నిగ్ధత అతనికి తెలుసు. కానీ అది తనవల్ల స్పందన పొందడం లేదని, దానికి లోపం తనదేనని గ్రహించుకోగల వివేకి.

ఎవరిలోనూ లోపాన్ని ఎంచడానికి ఇష్టపడని వ్యక్తి.....................

  • Title :Konni Shephalikalu
  • Author :Vadrevu Veeralakshmidevi
  • Publisher :Saketh Publications
  • ISBN :MANIMN4558
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :240
  • Language :Telugu
  • Availability :instock