నానృషిః కురుతే కార్టూన్
నాచేతిలో అధికారం లేదుగానీ, వుంటే కరెన్సీ నోట్లమీద బాపుగారి కార్టూన్లు అచ్చు వేయించి వుందును. పడిపోతున్న ఇండియన్ కరెన్సీ విలువ పెంచడానికి యిదొక చక్కని చిట్కా అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. దీనివల్ల సమకూరే అదనపు సౌకర్యాలు బాపు కార్టూన్ల లాగా చాలా చాలా వున్నాయి.
ఇన్కమ్ టాక్స్న కలవారు ఘల్లున నవ్వేస్తూ చెల్లించే అవకాశం వుంది. ఎంత కట్టినా చాలు, అదే పదివేలు అని భావించి టాక్స్ వాళ్లు స్వీకరించనూ వచ్చు. డాక్టర్లకు లాయర్లకు నవ్వుల్లో పెట్టి ఫీజు యిచ్చుకుంటారు పేషెంట్లు, పార్టీలు.
అప్పారావుకి ఓ ఫైవ్ యిస్తూ కూడా ఋణదాత నొవ్వకపోగా నోటుమీది కార్టూన్ని చూసి నవ్వక తప్పదు...........