₹ 90
1714 , జులై 20 న, లైమా, కుజ కోల మధ్య ఉన్న ఒక ప్రసిద్ధ స్తంభాల వంతెన కూలిపోయింది. ఆ సమయంలో ఆ వంతెన పై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు క్రింద ఉన్న అగాధంలో పది అసువులు బాసారు. అదే సమయంలో ఆ వంతెన వైపు నడిచివస్తున్న ఒక మతగురువు ఈ విషాద దృశ్యాన్ని కళ్ళారా చూడడం జరిగింది. స్వతహాగా ఆలోచనా పరుడైన ఆ మతగురువు మనస్సుకు ఈ సంఘటన ఈశ్వర విలాసానికి ఇదొక నిదర్శనమా అనిపించింది. అందుచేత ఆ చనిపోయిన అయిదుగురు జీవితాలను అన్వేషించాడు.
ఆ అయిదుగురు వ్యక్తుల అంత ప్రవృత్తులను , ఉద్వేగాలను రచయిత మన మనస్సుకు హత్తుకుపోయేట్టు, మనలను చకితులను కావించేట్లు ఎంతో ఉదాత్తంగానూ, స్వచంగాను చెప్పి వారికీ జీవితం కల్పించాడు.
ఈ విషాద సంఘటనలకు ఈశ్వర ప్రమేయం ఏమున్నదని సాహసంతో ప్రశించే, అన్వేషణకు పూనుకున్న ఆ మతగురువుకు మరణశిక్ష విధించబడింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
- Title :Koolina Vanthena
- Author :Thoronton Wilder , Nanduri Vital
- Publisher :pallavi Publications
- ISBN :MANIMN1792
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :87
- Language :Telugu
- Availability :instock