₹ 300
దారి తెలిసిన తూటా. దట్టించిన భావజాలం. వయసు మళ్లిన యవ్వనం. నెలదాగి మాగిన సైద్ధాంతిక పాతర... తదితరా లేవి గమ్మునుండవు. గోటి గాటు కె ఉప్పెనలవుతాయి. పలుకు స్పర్శ కె విస్ఫోటిస్తాయి. కన్నీటి ఛాయాకే కత్తులు దూస్తాయి. ఆ తదితరాల్లో ఇంకింకో ఒకానొక తీవ్రత రవిమారుతం. వేడి గాలి అనల వాయువూ సూరీడి గడుపూ కదా.. అందుకే ఇది ఆగ్రహమూ ఆందోళనా ఉద్వేగమూ ఆలోచనా కలగలిపి మెలి పెట్టిన పొలికేక. అంతేకాదు... పూలవనలూ పరిమళాలూ పరవశాలూ పెనవేసుకున్న నేమాలిక కూడా.
కోపోద్రిక్త స్వరాన్ని వినాల్సిందే... సామజిక ప్రాపంచిక రాజకీయ మానసిక కాల్పనిక ప్రహేళికా లోకంలో నిన్నూ నన్నూ మనందరినీ ప్రవేశ పెట్టి దారి తప్పకుండా ప్రతి మలుపులో క్లూలతో సిద్ధంగా ఉండే చూపుడువేళ్ల కోసం.......
- Title :Kopodriktha Svaram
- Author :Ravi Maruth
- Publisher :Sri Sri Printers
- ISBN :MANIMN1619
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :246
- Language :Telugu
- Availability :instock