బాలుగారితో మా అనుబంధం
- జలంధర చంద్రమోహన్
అజాతశత్రువు, అద్భుతమైన కళాకారులు, మనిషిగా మహోన్నతమైన వ్యక్తిత్వం వున్న ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంగారికి నివాళి అంటూ ఇలా అశ్రువులతో ఆర్టికల్ రాయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు నేను.
శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు (దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత) శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగారు, శ్రీ మల్లంపల్లి చంద్రమోహన్ గారు... వీరు ముగ్గురూ సినీప్రపంచములో ధ్రువ తారల్లాగా ప్రకాశించారు... సాధారణంగా సినీ పరిచయాలు కుటుంబ పరిచయాలుగా మారవు.
స్టూడియోల్లో, ఔట్ డోర్స్ వీరంతా అతి సన్నిహితులుగా... ఒకొక్కసారి ప్రాణ స్నేహితులుగా వుండచ్చు. కానీ ఆ పరిచయాలు కుటుంబాల వరకు విస్తరించడం చాలా అరుదైన విషయం.
కానీ మా మూడు కుటుంబాలు దాదాపు ముప్ఫై సంవత్సరాలు చాలా సన్నిహితంగా మెలిగాము. దానికి ముఖ్య కారణం మాకు బంధుత్వం వుండడము. మరొక అతిముఖ్య కారణము... నేను, మా జయలక్ష్మి అక్కయ్య (శ్రీ విశ్వనాథగారి భార్య), మా సావిత్రి (బాలుగారి భార్య) అక్కాచెల్లెళ్ళలాగా,...............