• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Kotha Panduga

Kotha Panduga By M S K Krishna Jyothi

₹ 125

కాకి గూడు

ఒడి దుడుకులు తట్టుకోవాలంటే ఏదో ఒక గూడు ఉండాల్సిందే. అది కాకికైనా, మనిషికైనా. నేనొక మనిషిని. ఆడమనిషిని. నా పేరు అడక్కండి. అది ఒక్కోళ్ళ దగ్గరా ఒక్కో రకంగా మారిపోతుంది. అయినా నా పేరు తెలుసుకుని మీరు ఏం చేస్తారు? చెప్పాలంటే పేరుతో నాకే ఎప్పుడో గానీ పెద్దగా పని పడదు. అసలు ఇది నా పేరు కథ కాదు. మా వేపచెట్టుమీద కాకిజంట కట్టుకున్న గూడు కథ.

చిన్నప్పుడు ఒక ఇంట్లో ఉండేదాన్ని. అది అమ్మావాళ్ళ ఇల్లు. ఇప్పుడు ఉండేది అత్తవారి ఇల్లు. అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న పాపాయిగా ఉన్నప్పుడు ప్రతి రోజూ వెనకున్న మేడవైపు చూస్తే, ఏడుగంటలకల్లా బోలెడన్ని కాకులు వచ్చి వాలి ఉండేవి. ఆ ఇంట్లో ఉండే పెద్దాయన వాటికి మేత వేసేవారు. ప్రతి రోజూ అలవాటు పడటం వల్లన ఏమో, ఆయనకీ ఆరోగ్యం బాలేక ఇంట్లో పడుకుని ఉన్నా కూడా, కొన్ని కాకులు ఆ సమయానికి వచ్చి ఓసారి తొంగి చూసి వెళ్ళేవి. ఏ మాత్రం ఓపిక చిక్కినా, మేత కోసం వచ్చిన కాకుల్ని నిరాశ పరచకుండా ఆయన వాటికి ఆహారం పెట్టేవారు. అమ్మావాళ్ళు ఆయన గురించి చాలా గౌరవంగా మాట్లాడే వాళ్ళు. బహుశా ఆయన కాకుల్ని చేరదీయడం మంచి సంగతిగా వాళ్లకి తోచి ఉండవచ్చు. లేక పోతే ఆ ఇల్లు పెద్దది కావడం వల్ల కలిగిన కుటుంబమని అబ్బురపడేవాళ్ళేమో. బహుశా ఈ రెండు కారణాలూ కలసిపోయి కూడా ఉండుంటాయి. కాకి ఆయుష్షు డబ్బ్భై ఏళ్ళు. మనిషితో కూడా బతుకుతుంది. కానీ మనిషికి.............

  • Title :Kotha Panduga
  • Author :M S K Krishna Jyothi
  • Publisher :Cira Mudra Prachuranalu
  • ISBN :MANIMN6077
  • Binding :Papar Back
  • Published Date :June, 2019
  • Number Of Pages :136
  • Language :Telugu
  • Availability :instock