• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kotha Telangana Sasanalu

Kotha Telangana Sasanalu By Sri Ramoju Haragopal

₹ 300

కోటిలింగాల శాసనం

 

కోటిలింగాల జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని తొలి చారిత్రక ప్రదేశం. ఇక్కడ బౌద్ధ మహాస్తూపం, దానిచుట్టు శాసనఫలకాలు లభించాయి. వాటిలో కొన్ని కరీంనగర్ పురావస్తుశాఖ మ్యూజియంలో ఉన్నాయి. ఇటువంటి శాసనఫలకాలెన్నుండేవో తెలియదు.

కోటిలింగాలలో ఒక ఇంటి ముందు పడివున్న రాతిఫలకమ్మీద 5 బ్రాహ్మీలిపి అక్షరాలు కనిపించాయి. లిపి రీత్యా ఈ అక్షరాలు మౌర్యపూర్వలిపికి చెందినవి.

శాసన పాఠం : 'చవోఏపురె’

శాసన సారాంశం : ఈ శాసనంలో ఉన్న అక్షరాలు ఐదే. చివరి రెండక్షరాలు పురె అంటే 'పుర' సంబోధన. కోటిలింగాల మహాస్తూపాని కున్న శిలాకంచుకం మీద తాపడం చేసిన 56 రాతిఫలకాలలో 26లో విరిగిన రెండు పోను, మిగిలిన 24 రాతిపలకల మీద లిపిని ఎపిగ్రఫిస్టు, భాషాశాస్త్రవేత్త మల్లావఝల నారాయణశర్మ చదివి, పరిష్కరించాడు. ఆ పలకల మీది లిపిని అనుసరించి ఈ శాసనంలోని తొలి అక్షరాన్ని 'చ'గా గుర్తించడమైనది. అపుడది ‘చవోఏపురె' అయింది. అర్థసాధన కొరకు ఈ నామశాసనాన్ని ఇంకా పరిశోధించ వలసి వుంది.

ధన్యవాదాలు :

ఈ శాసనాన్ని సేకరించడంలో సాయం అందించిన వేముగంటి మురళీకృష్ణ, వేముగంటి రఘునందన్ గారలకు............

  • Title :Kotha Telangana Sasanalu
  • Author :Sri Ramoju Haragopal
  • Publisher :Matti Mudranalu
  • ISBN :MANIMN5141
  • Published Date :Matti Mudranalu
  • Number Of Pages :254
  • Language :Telugu
  • Availability :instock