• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Koti Ashala Manishi

Koti Ashala Manishi By Shonti Jayaprakash

₹ 150

ఫ్రెంచి కథ

రుణం

 

మూలం : గైడీ మపాసా

ఆమె పేరు ఫ్యానీ యెత్తుగా, అందంగా వున్న ఇరవైమూడేళ్ల యువతి. యవ్వనపు పొంగులతో, వొంపుసొంపులతో అప్సరసలను తలపించే ఫ్యానీ... ఆ దారంట వచ్చీపోయే ప్రతి దానయ్యనూ, 'అందగాడా' అంటూనో, 'సక్కనోడా' అంటూనో పిలుస్తూవుంది. వాళ్లనుద్దేశించి స్... స్... స్... అంటూ ముందరి పళ్లమధ్య నాలుక కదిలిస్తూ సన్నగా ఈలలాంటి శబ్దం వెలువరిస్తూ “ఓయ్ సుందరా! ఇదుగో నిన్నే... ఇటు చూడు! పిలుస్తుంటే అలా పారిపోతున్నావేంటి? నాదొక్క చిన్నమాట విను... నా వొంట్లో వేడి కుంపటుంది. ఈ డిసెంబరు చలిలో ఈ రాత్రికి మా ఇంటికొచ్చావంటే, వెచ్చదనమిస్తాను” అంటూ ఆహ్వానిస్తూ వుంది. అభ్యర్థిస్తూ వుంది.

రోజూ అలవాటుగా వల్లించే మాటలతో, శృంగార చేష్టలతో విటులను ఆకర్షించడానికి విశ్వప్రయత్నం చేస్తూవుంది. ఆమె దురదృష్ట మేమోకానీ, ఆరోజు అప్పటిదాకా ఆమెకు వొక్కటంటే వొక్క 'గిరాకీ ' కూడా తగల్లేదు.

క్రమంగా చీకటి చిక్కనవుతూ వుంటే ఆమెలో ఆరాటం మొదలయింది. కనీసం అయిదు ఫ్రాంకులనైనా ఆర్జించకపోతే, మరుసటి దినం పస్తులుండాల్సిందే. అందుకే ఆమె రోడ్డు పక్కన కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ వుంది. ఇంకో గంటలో ఆ ప్రదేశం నిర్మానుష్యమైపోతుంది. ఆమెలో ఆ భావం మెదలగానే భయంతో, పిచ్చిపట్టిన దానిలా రోడ్డు వెంబడి నడుస్తూవుంది. ఆమె మనసు మూలల్లో యేదో చిన్ని ఆశాదీపం మినుకు మినుకుమంటుంటే.

సౌందర్యానికే భాష్యం చెప్పేటటువంటి అందం గల ఫ్యానీ, మరుసటి దినానికవసరమైన అయిదు ఫ్రాంకులు... కేవలం అయిదు ఫ్రాంకుల కోసం...........................

  • Title :Koti Ashala Manishi
  • Author :Shonti Jayaprakash
  • Publisher :Janani Memorial Trust
  • ISBN :MANIMN6598
  • Binding :Papar back
  • Published Date :April, 2025
  • Number Of Pages :119
  • Language :Telugu
  • Availability :instock