• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Kotta Choopu ( DVVS VARMA)

Kotta Choopu ( DVVS VARMA) By Kotta Choopu Dvvs Varma

₹ 100

ప్రజా ఉద్యమాలకు దారి దీపం డి.వి.వి.యస్.వర్మ గారు

యాభై సంవత్సరాలకు పైగా వర్మ గారు నాకు తెలుసు. అభిమానిగా, అనుచరుడిగా కంటే సహచరునిగా దశాబ్దాలపాటు కలసి పనిచేశాం. ఈ సుదీర్ఘమైన ఉద్యమ సహచర్యంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు అన్నీ రాస్తే అదే ఒక పుస్తకం అవుతుంది. కమ్యూనిస్టు ఉద్యమం సృష్టించిన ఎందరో ఉత్తమ వ్యక్తుల గురించి వింటూ ఉంటాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన కథానాయకుల జీవిత గాథలు చదువుతూ ఉంటాం. కానీ, మన మధ్యలోనే ఉంటూ మౌనంగా తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోయే సిసలైన కథానాయకుల విశిష్టతలు మన దృష్టికి పెద్దగా రావు. డి.వి.వి.ఎస్.వర్మ అలాంటి కోవకు చెందిన వ్యక్తి.

ఒక మార్సిస్టు మేధావిగా, నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్తగా, నిజాయితీ మూర్తీభవించిన నిరాడంబర నాయకునిగా వర్మ గారు రెండు తెలుగు రాష్ట్రాలలోని కమ్యూనిస్టు ఉద్యమ శ్రేణులకు చిరపరిచితులు.

చారిత్రక, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై ఆయన చేసిన రచనలు, విశ్లేషణలు కొత్తదైన లోచూపుతో ఉంటాయి. సామాజిక ఉద్యమాలలో విశాల ప్రజానీకం విస్తృతంగా పెద్ద ఎత్తున పాల్గొనడానికి వీలుగా వర్మ గారు రూపొందించే నినాదాలు, పోరాట రూపాలు, వైవిధ్యంగానూ, వినూత్నంగానూ, సరళంగాను, అదే సమయంలో అత్యంత ప్రభావవంతంగానూ ఉంటాయి. కొత్త తరహా ప్రజా ఉద్యమాల రూపశిల్పిగా తనదైన ప్రత్యేక స్థానాన్ని శాశ్వతం చేసుకున్నారు.

ఐదారు దశాబ్దాల వర్మ గారి సామాజిక కార్యకలాపాల కుదురు నుండి నా లాంటి అనేకమంది సామాజిక కార్యకర్తల బలగం మొలకలు వేసింది. అది తెలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉంది. విభిన్న జీవన రంగాలలో ఆ మొలకలు ఎదిగి తమదైన.................

  • Title :Kotta Choopu ( DVVS VARMA)
  • Author :Kotta Choopu Dvvs Varma
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN6200
  • Binding :Papar Back
  • Published Date :March, 2025
  • Number Of Pages :304
  • Language :Telugu
  • Availability :instock