₹ 100
తెలుగు సాహిత్య రంగానికి పునర్వైభవాన్ని సాధించి, సామాజిక దిశా నిర్దేశనంలో సాహిత్యం తన వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వహించేట్టు చేయాలన్న తపనతో సంచిక వెబ్ పత్రిక ఆరంభమయింది. ఆరంభించిన కొద్దికాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది.
పాఠకాదరణ ఇచ్చిన ధైర్యంతో సంచిక వెబ్ పత్రిక ప్రతి మూడు - నాలుగు నెలలకూ ఒక కథా సంకలనాన్ని ప్రచురించాలని నిశ్చయించింది. తద్వారా తెలుగు కథ విస్తృతిని, వైచిత్రిని ప్రదర్శించాలని సంకల్పించింది. ఆ సంకల్పం సాకారమవటంలో తొలి అడుగు దేశభక్తి కథల సంకలనం. రెండవ అడుగు క్రీడాకథ (కథా సంకలనం) భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన కథల సంకలనాలతో మీ ముందుకు వస్తుంది సంచిక.
సంచిక వెబ్ పత్రికను చదవండి. చదివించండి.
తెలుగు సాహిత్యానికి పునర్వైభవం సాధించటంలో తోడ్పడండి.
- కస్తూరి మురళీకృష్ణ