క్రీడాస్థలి
మైదానం లోపల - బయట
“నువ్వు గెలిచేవరకూ నీకథ ఎవరికీ అవసరం లేదు, ఎవరూ వినిపించుకోరు కూడా. నీకథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి”.
"Book worms, Gold Medalists and office clerks are not what Uni- versities should endeavor to produce -- But Men of Character who will become great by achieving greatness for their country in different spheres of life" ---- Netaji
(విశ్వ విద్యాలయాలు పుస్తకాల పురుగులను, బంగారు పతకాలు సాధించే వాళ్ళను, కార్యాలయాలలో గుమస్తాలను తయారుచేయటానికి ప్రయత్నించకూడదు. కానీ, ఎవరైతే తమ గుణగణాలతో వివిధరంగాలలో తమ తెలివితేటలతో గొప్ప స్థాయిని అందుకుంటారో వారే దేశానికి అవసరం.)
"భారతదేశం” తలచుకుంటే ఒక్కసారిగా గుండె ఉప్పొంగి, ఒళ్ళు పులకరించింది. ఆగష్టు 15 స్వతంత్ర దినోత్సవం. స్వతంత్రం సిద్ధించి సరిగ్గా 75 సంవత్సరాలు, అంటే మా అమ్మకి కూడా. ఆ సంవత్సరంలో పుట్టిన ఆడ పిల్లలం దరికీ అప్పటి తరంవారు ఎంతో ఇష్టంగా, ప్రేమగా, దేశభక్తితో వారి అమ్మాయిలకు "రాజ్యలక్ష్మి" లేదా "స్వరాజ్యలక్ష్మి" లాంటి పేర్లు పెట్టుకున్నారు. కాబట్టి మా అమ్మ పేరుకూడా "రాజ్యలక్ష్మి". అలాగే మా అత్త పేరు స్వరాజ్యలక్ష్మి.
స్వాతంత్య్రము వచ్చిన కొద్ది సంవత్సరాలకే ఆరుద్ర వ్రాసిన ఒకపాత సినిమా పాటలో అప్పటి దేశ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు “గాంధి పుట్టిన దేశమా ఇది, నెహ్రు కోరిన సంఘమా ఇది" అని,
అదే నటుడుతో మరొక పాత సినిమా పాటలో వారు యువతనుద్దేశించి ఇలా అన్నారు, "దేశానికి వెన్నెముకలు మీరు, దివాళాకోరులు కావద్దు" అని ఉద్బోధించారు. ఈ రెండు గేయ కవితల్లో మనకు అర్థమైంది ఏమంటే స్వతంత్రం వచ్చిన కొన్ని..............