• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Krishnaveni Tharangalu

Krishnaveni Tharangalu By V Krishnaveni

₹ 120

చిన్ననాటి ముచ్చట్లు

1924వ సంవత్సరం డిశంబరు నెల 24వ తేదీన, రాజమండ్రిలో సిరంశెట్టి కృష్ణారావు దంపతులకు జన్మించాను. మా తల్లిగారి పేరు నాగరాజు. వినటానికి, విచిత్రంగా వుంది కదూ!

మా తండ్రిగారు వృత్తిరీత్యా డాక్టర్. రాజమండ్రిలో క్లినిక్ ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల ప్రాంతంలోని పంగిడి గూడెం రాజావారి ఆస్థానంలో డాక్టరుగా పని చేయటం వల్ల తరచూ, అక్కడికి వెళ్ళి వస్తుండేవారు. నేను నెలల పిల్లగా వున్నప్పుడు, మా అమ్మగారు నరసాపురం వద్ద వున్న అంతర్వేది తీర్థం చూడడానికి, పడవపై బయలుదేరారు. నన్ను ఒడిలో కూర్చోబెట్టుకున్న మా తల్లి పడవ అంచున కూచుని నీటి కెరటాలతో, మరో చేత్తో ఆటలాడ సాగేరు, ఏమరుపాటున వుండగా, నేను చేయిజారి నీళ్ళల్లో పడడం, పడవ వాళ్ళు నీటిలో దూకి నన్ను రక్షించటం, క్షణాల్లో జరిగిపోయింది. ఆ విధంగా నీటి గండం తప్పింది. కృష్ణుడు వలె ఎదురువేళ్ళతో పుట్టడం వల్ల, కృష్ణవేణి అని పేరు పెట్టారు. గర్భవతులకు వీపు నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలుంటే, వారిని పడుకోబెట్టి, నా పాదాలకు ఆముదం రాసి, నా కాళ్ళతో, మర్ధన (మసాజ్) చేయించేవారు. దాంతో వారి నొప్పులు, మటుమాయం అయేవి.

చిన్నప్పుడు చాలా అల్లరి చేసే దాన్నట. స్కూలు అన్నా, చదువన్నా, మాష్టర్లన్నా ఎంత భయమో, నాటకాలు చూడటం అంటే అంత ఇష్టం. అప్పట్లో మా బావగారు, నాగేశ్వరరావుగారు, మున్సిపల్ ఆఫీసర్గా పని చేసేవారు. ఆయన నన్ను ఎంతో ప్రేమతో చూసేవారు. అప్పట్లో కాంచనమాల నటించిన 'సతీ సక్కుబాయి' నాటకాన్ని చూపించారు. నేను చూసిన తొలి నాటకం అది. ఆ నాటకం, నన్నెంతో ప్రభావితం చేసి, నటన పట్ల ఆసక్తి కలిగించింది.

నాకు ఏడు సంవత్సరాల వయసు వుండగానే, భయంకరమైన క్షయవ్యాధితో మా తల్లిగారు మరణించారు. మా తల్లిగారి మరణానంతరం, మా తండ్రి, ద్వితీయ...............

  • Title :Krishnaveni Tharangalu
  • Author :V Krishnaveni
  • Publisher :Navodaya Book House
  • ISBN :MANIMN4748
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2021
  • Number Of Pages :95
  • Language :Telugu
  • Availability :instock