• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kriyayogamu Mariyu Advaitavadamu

Kriyayogamu Mariyu Advaitavadamu By Dr Ashok Kumar Cattarji

₹ 200

భూమిక

యోగుల దేశం భారతదేశం. యోగం గురించి తెలియకుండా యోగిని తెలుసుకోవడం ఎలా అయితే సాధ్యం కాదో, అలానే యోగిని తెలుసుకోకుండా ఆధ్యాత్మ భారతదేశాన్నీ తెలుసుకోలేము. అందుకే యోగం లేకుండా భారతదేశం, భారతదేశం లేకుండా యోగము ఉండవని అంటారు. కాబట్టే యోగసాధనే సరియైన జీవనశైలి మరియు యోగసాధన చేయడమే అందరికీ కూడా ఏకైక కర్తవ్యం. కానీ దుఃఖించవలసిన విషయం ఏమిటంటే వర్తమానకాలంలో ఈ సనాతనయోగానికి విరుద్ధంగా అనేక దుష్ప్రచారాలు వినబడుతున్నాయి. ప్రస్తుతకాలంలో అందరూ చెబుతున్నది ఏమిటంటే కలియుగంలో యోగం నడవదు అని. కానీ ఎందుకని? కలియుగంలోని మనుషులు ఎందుకని యోగసాధన చేయలేరు? కలియుగంలోని మనుషులు మనషులు కారా? పూర్వకాలంలోని మానవులు ఏ రకంగా జన్మించేవారో, జీవించేవారో, మరణించేవారో అలాగే ఈ కాలంలోని వారు కూడా ఉన్నారు కదా? పూర్వకాలంలో కూడా మానవులకు సుఖదుఃఖాలుండేవి, సంసారం ఉండేది, అన్నీ ఉండేవి. ఇప్పుడు కూడా అలానే ఉంది. అయితే మరి భేదం ఎక్కడుంది? ఈ భేదం ఒక్క విషయంలోనే అవుపిస్తోంది. అదేమిటంటే పూర్వకాలంలో దాదాపుగా మానవులందరూ కూడా ఈశ్వరవిశ్వాసులై ఉండేవారు. యోగసాధన చేసేవారు, వారి జీవితం సామాన్యంగా ఉండేది. ఆ కాలంలో ఎవరైనా ఈశ్వరసాధన చేయనట్లయితే అటువంటివారిని నిందితులుగా చూసేవారు. అయితే వర్తమానకాలంలో దీనికి విరుద్ధమైన పరిస్థితి అవుపిస్తోంది. ప్రస్తుతకాలంలోని జనులందరూ ఎక్కువమంది విలాసప్రియులు, ఆరామప్రియులు, వీరెవ్వరూ కూడా అల్పసంతోషులు కారు, అంతేకాక ఈశ్వరుడివైపుగా మనస్సు ఉండడం అనేది వీరిలో చాలా అరుదు. వీరిలో ఎవరైనా ఈశ్వరసాధన చేయనట్లయితే అటువంటివారు నిందితులు కారు. పైగా సాధనాపరాయణులు కాకపోయినా కూడా ధనసంపదలు పుష్కలంగా ఉన్నట్లయితే అలాంటివారే వర్తమానకాలంలో ఎక్కువగా గౌరవం పొందుతున్నారు....................

  • Title :Kriyayogamu Mariyu Advaitavadamu
  • Author :Dr Ashok Kumar Cattarji
  • Publisher :Sanatan Yogadharma Prasar LLP
  • ISBN :MANIMN5631
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :397
  • Language :Telugu
  • Availability :instock