కొన్ని కృతజ్ఞతలు
నాలో పుస్తకంగా రూపం తీసుకున్న ఈ పార్శ్వానికి జీవం పోసింది ఎందరెందరో.
మొదటగా అన్నయ్యతో మొదలుపెట్టాలేమో. యవ్వనం రెక్కలు విచ్చుకునే సమయానికి నా చుట్టూ హైదరాబాద్ ఇరానీ కేఫులు, రచనా ప్రపంచం గురించి చర్చలు, రచయితల చుట్టూ ఉండే
'ఆరా'లు చూపించినందుకు,
ఆ తరువాత నా రాతలో 'అదేదో ఉంది' అని గమనించి నాలోపల నుంచి ఇంకేదో రాగలదు అనే స్పృహ ఇచ్చిన శిరీష్ అన్న
నా మొదటి కథ 'త్రేన్పు'ని ప్రచురించిన అఫ్సర్ గారికి; కొన్ని రోజులే రాసినా ఎంతో ప్రోత్సహించిన చాయ్ బిస్కెట్ అనురాగ్గారికి; మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంతో నేర్పిన మాధవ్ మాచవరంగారికి; ఒక మినీ ప్రయాణమే చేయించిన ఈమాట టీమికి థాంక్స్ చెప్పుకోవాలి.
ఈ పుస్తకం గురించి నాకన్నా ఎక్కువగా కలలు కన్న చరిష్మా ఇరువారం గారికి థాంక్స్ చెప్పి దూరం చెయ్యలేను. నా కలలని పంచుకుని మెలకువల దారి పరిచిన మానసచామర్తిగారు. కొన్ని మాటల్లో మీ ఇద్దరి గురించి చెప్పి కుదించలేనంత స్నేహం....................