కుక్కలు
మానసి అతన్ని ఇంచుమించు ఇరవై ఏళ్ళ తరువాత కలుసుకుంది. ఈమధ్య కాలంలో అతను ఎన్నికల్లో పాల్గొనడానికి కావలసిన పలుకుబడి సంపాయించుకున్నాడని రాజకీయాలను ఆకళించుకొన్న కొంతమంది స్నేహితులు ఆమెతో చెప్పారు. ఎన్నికల సమయంలో బొంబాయి వంటి మహా నగరంలో ఇరవై నాలుగ్గంటలూ పంపుల్లో నీళ్ళురప్పించటం, అందరికి అందుబాటులో ఉండేలా ఆహార ధాన్యాలు సప్లై చేయించటం, నిర్వాసితులకు చౌకలో అద్దెకు ఇళ్ళు లభించేలా చూడటం వగైరా అందని ద్రాక్షపళ్ళ లాంటి అతను చేసిన వాగ్దానాలను ఆమె కూడా ఒకటి రెండుసార్లు పేపర్లలో చదివింది.
మానసి భర్త ఓసారి అతని ఫొటోని చూపించి నవ్వుతూ అడిగాడు. కూడా “ఇతను నీ భక్తులలో ఒకడు కదూ! కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ పైత్యంతో నీకు ఉత్తరాలు రాసినట్టున్నాడు కదూ..." అని, అవును, నిజమే! ఆమె యౌవనారంభ దశలో ఉండగా బెంగాల్ లోని తాత గారింటికి వెళ్ళిన రోజుల్లో అతను పాలిపోయిన మొహంతో బక్క పల్చగా ఉండేవాడు. మరి ఇప్పుడో... పుష్టిగా... బాగా రంగు తేలి సూర్యబింబంలా వెలిగిపోతున్నాడు...................