• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kukkuta Sastram

Kukkuta Sastram By Ch Srinivas Senior Jornalist

₹ 900

నాటుకోళ్ల పెంపకం

కోళ్ల పెంపకం గ్రామీణులు, గిరిజనుల జీవన విధానంలో అంతర్భాగం. కోళ్ల పెంపకం ద్వారా లభించే గుడ్లు, మాంసా న్ని ఆహారంగా అవసరమైన వారంతా తీసుకుంటారు. ప్రస్తు తం గుడ్ల కోసం లేయర్లు, మాంసం కోసం బ్రాయిలర్లు పెంచుతున్నా నాటుకోళ్లపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణం ఇవి సహజంగా పెరిగి, పోషకాలు సమృద్ధి గా ఉన్న గుడ్లు, మాంస ఉత్పత్తులను ఇస్తాయి. అందువల్ల మార్కెట్లో నాటుకోడి గుడ్లు, మాంసానికి రానురాను డిమాండ్ బాగా పెరుగుతుంది. నాటుకోడి గుడ్లు, మాంసం కోసం ఎంతడబ్బైనా ఖర్చుచేసేందుకు ధనవంతులు వెనుకా డటం లేదు. ఈ డిమాండ్ను ఆధారంగా చేసుకుని నాటు కోళ్ల పెంపకాన్ని స్వయం ఉపాధిగాను, వ్యవసాయ అనుబం ధ పరిశ్రమగా కూడా నిర్వహించి మంచి ఆదాయం పొంద వచ్చు. నాటుకోళ్లు పరిమితంగా లభిస్తాయి కాబట్టి వాటి స్థానంలో అభివృద్ధి పరచిన కోళ్లను పెంచుకోవచ్చు. ఈ కోళ్ల రూపం, గుడ్లు, మాంసం కూడా నాటుకోళ్లనే తలపిస్తుంది. పైగా దిగుబడి ఎక్కువ. ఇప్పటికే ఈ తరహా పెంప కం ఫారాలు నిర్వహించిన అనేక మంది సక్సెస్ సాధించి సంతోషంగా ఉన్నారు. రెండు కోళ్లతో పెంపకం ప్రారంభిం చిన వారు ఇప్పుడు 5 వేల కోళ్లు పెంచేస్థాయికి ఎదిగారు. అందువల్ల కొద్దిపాటి జాగ్రత్తలతో కోళ్ల పెంపకం మంచి లాభసాటి వ్యాపారంగా భావించవచ్చు.

 ఆసక్తి ఉంటే చాలు 

నాటుకోళ్లు లేదా పెరటి కోళ్ల పెంపకం చేయాలనే. ఎవరైనా ప్రారంభించవచ్చు. దీనికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు. పెద్దగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడి, సాంకేతికత, నైపుణ్యం గల పని వారు ఉండనవవసరం లేదు. ఆహారం కోసం పెద్దఫార్ములా కూడా వాడాల్సిన అవసరం లేదు. పెరటి కోళ్లకు దాణా పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి బయటే తింటా యి. కొద్దిగా స్థలం ఉంటే చాలు. ముందుగా పది కోళ్లతో పెంపకం ప్రారంభించి అనుభవం సంపాదిస్తే మంచిది..............................

  • Title :Kukkuta Sastram
  • Author :Ch Srinivas Senior Jornalist
  • Publisher :DP Publications, Vijayawada
  • ISBN :MANIMN6505
  • Binding :Papar back
  • Published Date :Oct, 2025
  • Number Of Pages :235
  • Language :Telugu
  • Availability :instock