కులం ఒక అధ్యయనం
ప్రత్యేకతలు:
“భారతదేశంలో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, పూర్వీకులపై ఆధారపడేలా చేసే సామాజిక ఆచారాలు, ఆదర్శాలను ప్రతిఘటించే సంప్రదాయాలు మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. గుడ్డిగా సోమరితనంతో, బూజుపట్టిన పురాతన సంప్రదాయాలను పూజిస్తూ, సమకాలీనంతో ఏమాత్రం పొసగనితనం అలవాటుగా మారింది. దీనికి ప్రధాన కారణం భారతదేశంలోని వేలాది ఏళ్ళుగా వేళ్లూనుకుపోయిన కులవ్యవస్థ”
- రవీంద్రనాథ్ ఠాగూర్
సామాజిక శాస్త్రం యొక్క అత్యున్నత ఆదర్శం సమాజంలోని రోగాల నిర్ధారణలోని మెరుగుదలలో ఉందని సరిగ్గానే చెప్పబడింది. ఈ క్రమం ప్రకారం అన్ని రకాల పురాతనత్వాలు చారిత్రక పరిశోధన అధీనంలో ఉండాలి. భారతదేశంలో కులపాలన యొక్క స్వభావం- ప్రాతిపదిక గురించి పరిశోధనకు పూనుకుంటే, అదంత విలువైందిగా అనిపించదు.
సహజంగా కొన్ని ప్రాథమిక సందేహాలున్నాయి, వీటిని ముందుగా పరిగణించాలి. కులం అనేది అన్ని నాగరికతలకు సంబంధించిన సార్వత్రిక విషయమా? లేదా ఇది ప్రత్యేకంగా భారతదేశపు సమాజానికే సంబంధించిన విచిత్ర విషయమా? సంఘం, వంశం, వర్గం వంటి సమానరూపాలైన సామాజిక విభజనలకు దానికి సంబంధం ఏమిటి? కులాలుగా విభజించడం మెజారిటీ పురాతన దేశాలకు సర్వసాధారణమని కొందరు భావిస్తారు. అన్ని పురాతన సమాజాలలో మనం జాతి భేదాలు, రాజకీయ పక్షాలు, వృత్తిపరమైన ప్రత్యేకతలను గమనిస్తాము. అన్ని సమాజాలలో సాధారణమైంది ఉన్నవాడు-లేనివాడి మధ్య, భూస్వామి-కౌలుదారు మధ్య, ధనవంతులు- పేదవారి మధ్య సంఘర్షణ అనేది కొనసాగుతూనే ఉంది. దళితుని పట్ల బ్రాహ్మణునికి వున్న అసహ్యత, పాకీవాని పట్ల యజమానికి ఉన్న అనహ్యతకు భిన్నంగా ఏమీ లేదు. మరోవైపు కులం అనేది ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అంశం అనీ ముఖ్యంగా అది హిందూమతంలో అంతర్భాగమని తెలుస్తోంది. ఈ రెండు....................