• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kulam pai Lohiya

Kulam pai Lohiya By K Satya Ranjan

₹ 150

 కులము, జెండర్ - రెండు విభాజకాలు

ఈ భూమ్మీద అత్యంత విషాదగ్రస్థులు భారతీయులే. వాళ్ళు కది పేదలేకాదు అత్యంత రోగగ్రస్థులుకూడా. సమీప గతచరిత్రలో వారి చైతన్యంలో చోటుచేసుకున్న విచిత్రమైన మలుపు కూడా మరో ముఖ్యకారణం. వాళ్ళు ఏదీ పట్టించుకొని తత్వాన్ని ప్రవచిస్తారు కానీ ఆచరణలో స్థూలంగా అన్నీ పట్టించుకుంటారు. అత్యంత దుర్భరమైన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి కృషిచెయ్యడంకన్నా అవే జీవితాలను పట్టుకు వేళ్ళాడుతుంటారు. డబ్బు, అధికారంకోసం అర్రులు సాచే వైఖరిని ఈ భూమ్మీద ఉన్న జనంలోకెల్లా ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.

భారతీయుల చైతన్యం ఈరకంగా పతనం చెందడానికి కులము, మహిళలు అన్న రెండు విభాజకాలే కారణం అని నేను నమ్ముతున్నాను. ఈ రెండు విభాజనాలూ మానవుల్లోని సాహస, సంతోషభావనలను చిదిమివేసేంతశక్తి కలవి.

ఆధునిక ఆర్థికవ్యవస్థ ద్వారా దారిద్ర్యాన్ని రూపుమాపితే ఈ విభాజకాలు కూడా వాటంతటి అవే అంతర్ధానం అయిపోతాయి అనే ఆలోచన శుద్ధ తప్పు. ఈ రెండు విభాజకాలు, దారిద్య్రం - ఇవి మన మాతృభూమిని తొలిచేస్తున్న వేరుపురుగులు.

ఈ రెండు విభాజకాల మీద నిరంతర పోరాటం సాగించకుండా దారిద్య్ర్య నిర్మూలనకోసం చేసే ఏ పోరాటమయినా నీడతో చేసే యుద్ధమే.

పవిత్ర బనారస్ పట్టణంలో భారత గణతంత్ర దేశాధ్యక్షుడు పబ్లికున ఇద్దరు బ్రాహ్మల కాళ్ళు కడిగాడు. పబ్లికున సాటి మనుషులు కాళ్ళు కడగడం అత్యంత అసహ్యకరమైన పని. అందులోనూ అసహ్యకరమైన పని అగ్రకుల హోదా గల బ్రాహ్మణులకే పరిమితం చెయ్యడం శిక్షార్హమైన నేరం. ఇది యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయిన, కులవ్యవస్థతో అనివార్యంగా తోడుగా వచ్చే పిచ్చిపని..........................

  • Title :Kulam pai Lohiya
  • Author :K Satya Ranjan
  • Publisher :Hydrabad Book Trust
  • ISBN :MANIMN6027
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :155
  • Language :Telugu
  • Availability :instock