• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kulam punaadulu

Kulam punaadulu By Kathi Padma Rao

₹ 150

కులం పునాదులు *డా॥ కత్తి పద్మారావు

                      తెలుగు సాహిత్యంలో మొదటి సామాజిక శాస్త్ర గ్రంథమిది. డా॥ కత్తి పద్మారావు గారు ఈ గ్రంథం కోసం మనుస్మృతి', 'పరాశర స్మృతి' వంటి ఎన్నో హిందూ ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసి వాటిలోని ఆశాస్త్రీయతను బయటపెట్టారు. నాగర లిపిలో ఉన్న మనుస్మృతి శ్లోకాలను తెలుగు చేసి మొట్టమొదటిసారిగా అర్ధాలు, వ్యాఖ్యానం చెప్పిన గ్రంథమిది. మొట్టమొదటి సారిగా అవైదిక ఉద్యమాలైన చార్వా క, బౌద్ధ, జైన వంటి ఉద్యమాలను మన ముందుకు తెచ్చారు. అంబేడ్కర్ 'కుల నిర్మూలన' గ్రంథ సారాన్ని ఇందులో వివరించారు. వేమన, త్రిపురనేని వంటి వారి సామాజిక కుల వ్యతిరేక ఉద్యమకారులను ఈ గ్రంథంలో పేర్కొన్నారు. ఈ గ్రంథం కులనిర్మూలన మీద వచ్చిన గ్రంథాల్లో సాధికారకమైన గ్రంథం. ఈ గ్రంథం

                       మొదటిగా 1980ల్లో వచ్చింది. కొన్ని వేల ప్రతులు పాఠకుల చేతుల్లోకి వెళ్లాయి. డా॥ కత్తి పద్మారావు గారు రాసిన 3 వ గ్రంథమిది. ఆ తర్వాత ఇప్పటికి 80 గ్రంథాలు రాశారు. అన్ని గ్రంథాలకీ ఈ పుస్తకంలోని ప్రణాళికే పునాద

                        కుల నిర్మూలన ఉద్యమానికి ఈ గ్రంథం ఆయుధం. ఈ విషయం మీద ఎన్నో సెమినార్లు జరిగాయి. సామాజిక శాస్త్రాలలో ఈ గ్రంథం సప్రమాణికమైనది. డా॥ కత్తి పద్మారావు గారి మేథస్సు, ఆలోచనా క్రమం, రచనా శైలి, పరిశోధనా పద్ధతి ఈ గ్రంథంలో వెల్లివిరుస్తాయి. 'కులం పునాదులు' మీ చేతి కరదీపిక అవుతుందని ఆశిస్తున్నాము.

                                                                                                                                                                                                                                                                       - లోకాయత ప్రచురణలు

  • Title :Kulam punaadulu
  • Author :Kathi Padma Rao
  • Publisher :Lokayatha Prachuranalu
  • ISBN :MANIMN2633
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :156
  • Language :Telugu
  • Availability :instock