• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Kundamala

Kundamala By Betavolu Ramabrahmam

₹ 400

అవతారిక

సంస్కృతరూపక వాఙ్మయమున కొక యలంకార మనఁదగిన ‘కుందమాల’, కొలఁది వత్సరముల క్రిందట శ్రీ మానవల్లి రామకృష్ణకవి. గారి పరిశోధన ఫలితముగ బయలువడినది. దాని ననుసరించి లాహోరు పండితులొకరు సంపూర్ణ పరిష్కరణముతో మరల ముద్రింపించి ప్రకటించిరి. సంపాదకులు తొలుదొల్తఁ బ్రకటించిన గ్రంథమున కాధారములు తంజావూరు మైసూరు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములలోని వ్రాఁత ప్రతులనియు, నందుఁ దంజావూరి ప్రతులు రెంటను లేఖక ప్రమాదములు మిక్కుటముగ నున్న వనియుఁ, బ్రస్తావనలు లేవనియుఁ, బ్రతులొక దానిం జూచి మఱియొకటి వ్రాయఁబడినవిగ నున్న వనియు తెలిపి, మైసూరు ప్రతులలోని స్థాపనను బట్టియు, మఱి కొన్ని కారణములను బట్టియు, నిది దిజ్నాగకృతియే యని నిర్ధారణ మొనర్చిరి. కాని, శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రీగారు తమ సంస్కృత వాఙ్మయ చరిత్రమునఁ దాము చూచిన తంజావూరి ప్రతులు నాధారము చేసికొని, నిఁకఁ గొన్ని హేతువులం బట్టియు, నిది ధీర నాగకవి ప్రణీత మని యభిప్రాయ మొసంగిరి.

కర్త దిజ్నాగుఁడే అని

'ఆరారాలపురవాస్తవ్యస్య కవేర్దిఙ్నాగస్యకృతి' ప్రస్తావనావాక్యము. 'అనూపురాధపురవాస్తవ్యస్య కవేర్డీరనాగస్యకృతి' అని గ్రంథాంతగద్యమునందలి వచనము. ఇందుఁ గవికృతమే..............

  • Title :Kundamala
  • Author :Betavolu Ramabrahmam
  • Publisher :Sri Raghvendra Publications
  • ISBN :MANIMN4137
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :354
  • Language :Telugu
  • Availability :instock