• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

KVR Diarylu
₹ 200

కె.వి.ఆర్. పరిచయం

జననం : 23-03-1927

మరణం : 15-1-1998

జన్మస్థలం: నెల్లూరు జిల్లాలోని 'రేబాల' గ్రామం

కె.వి.ఆర్. కవి, విమర్శకుడు, నాటక రచయిత, మార్క్సిస్టు మేధావి. తెలుగు సాహిత్య రంగంలో మొదట అభ్యుదయ సాహిత్యోద్యమానికీ, ఆ తరవాత విప్లవసాహిత్యోద్యమానికీ రథసారథి. 50 సంవత్సరాలపాటు రచనా వ్యాసంగం చేసిన సాహిత్య కృషీవలుడు.

ఇంటర్మీడియట్ నెల్లూరులోనూ, బి.ఎ. ఆనర్స్ విశాఖలోనూ చేశాడు. ఒంగోలులో కొంతకాలం పనిచేశాక కావలి, జవహర్ భారతి కళాశాలలో తొలుత చరిత్ర అధ్యాపకుడుగా చేరి, తరవాత రాజనీతి శాస్త్ర అధ్యాపకుడుగా కొనసాగాడు. 1949లో శారదాంబతో వివాహం. 1985లో జవహర్ భారతిలో పదవీవిరమణ.

1948లో అభ్యుదయ రచయితల సంఘంలో చేరాడు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీపైన నిర్బంధం వున్నా తన సామ్యవాద సాహిత్య, రాజకీయ కార్యకలాపాలను ఆపుకోలేదు. 1955లో ఆంధ్రా ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ ఓటమి పాలయ్యాక, అరసం నీరసించిందని అందరూ భావిస్తున్న తరుణంలో బెజవాడలో అరసం మహాసభలు నిర్వహించడంలో శ్రీశ్రీ, కొ.కు. లతో పాటు కీలక పాత్ర నిర్వహించాడు. 1955-65 మధ్యకాలంలో సాహిత్య రంగంలో ఉద్యమశీలత క్షీణించిన కాలంలో కూడా కమ్యూనిస్టు సిద్ధాంతపు కమిట్మెంట్తో రచనలు చేశాడు. 1955 ప్రాంతంలో సూరంపూడిలో రైతులపై కాల్పులు జరిగినప్పుడు ఆ సంఘటన ఆధారంగా 'అన్నపూర్ణ' నాటకాన్ని రాశాడు. మిత్రుడు వేణుతో కలసి వేశ్యాజీవితంపై 'రాజీవం' నాటకాన్ని రాశాడు. ఈ రెండు నాటకాలు అనేక ప్రదర్శనలకు నోచుకున్నాయి. జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానాన్ని సుస్థిరం చేస్తూ రాసిన ఉద్గ్రంథం 'మహెూదయం' 1969లో వెలువడింది. దీనికి ముందే, దువ్వూరి రామిరెడ్డి జీవిత, సాహిత్యాలపై 'కవికోకిల' గ్రంథాన్ని వెలువరించాడు. ఆ సమయంలోనే శరచ్చంద్ర ఛటర్జీపై సంక్షిప్తంగా రాసిన జీవిత కథ వచ్చింది. 1970లో శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా శ్రీశ్రీ సాహిత్యాన్ని ఆరు సంపుటాలుగా వెలువరించినపుడు, వాటికి విపులమైన పీఠికలు రాసి సంపాదకత్వం వహించాడు. రవీంద్రుడు, శరత్ మొదలు గురజాడ, దువ్వూరి రామిరెడ్డి............

  • Title :KVR Diarylu
  • Author :C S R Prasad , V Chenchaiah
  • Publisher :KVR Sharadamba Smaraka Kamiti
  • ISBN :MANIMN4478
  • Binding :Papar back
  • Published Date :March, 2022
  • Number Of Pages :442
  • Language :Telugu
  • Availability :instock