• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

KVR Smruthilo

KVR Smruthilo By KVR

₹ 100

కెవిఆర్ జిజ్ఞాస చాలా గొప్పది

 పె చ్.యస్.వి.కె. రంగారావు

Tossed about on life's ocean
who but a poet knows
the cool soft touch of wind
that stirs a poem's heart

- ఒక 'సిలోన్' కవి

తన సమకాలీన సమాజపు సాహిత్య సామాజిక రంగాలను గాఢంగా శించగలిగిన మేధాశాలిగా కెవిఆర్ అంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవం.

నిజానికి కవిత్వం ఆయన ఎంతగానో అభిమానించిన అభివ్యక్తి సాధనం. ఒక సందర్భంలో అజ్ఞానం కొద్దీ నేను ఆయన కవిత్వాన్ని కిందుచేసి వచన రచనలను పైకెత్తితే

చాలా నొచ్చుకున్నారు.

కెవిఆర్ వ్యక్తిత్వం అసాధారణమైంది. ఒక మేధాశాలిగా, క్రియాశీలిగా తాను ఎంతో శ్రమించి కూర్చుకొన్నది. ఆయన అభివ్యక్తీ అంతే విలక్షణం. ఒకరు మెచ్చుకోవడం, వేరొకరు నొచ్చుకోవడాలతో ఆయనకు పనిలేదు. ఆ వేరొకరు కృష్ణశాస్త్రి అయినా సరే, పుచ్చలపల్లి సుందరయ్య గారయినా సరే, కొ.కు, శ్రీశ్రీలయినా అంతే!

నాకెందుకో అప్పుడూ ఇప్పుడూ కెవిఆర్ అంటే చెన్నై మెరీనాలోని ప్రఖ్యాత చిత్ర, శిల్పకారుడు దేవీప్రసాద్ రాయ్ చౌదరి నిర్మించిన కాంశ్య శిల్పం, 'శ్రామికవిజయం' (ట్రయంఫ్ ఆఫ్ లేబర్) గుర్తుకొస్తుంది.

సృజనాత్మక రంగంలో కెవిఆర్ అంతటి నిరంతర శ్రమ అరుదు. ఆయన కఠోర పరిశ్రమకు ఆయన నిశిత బుద్ధిసూక్ష్మత జతైంది. మనలను ఎదురుగా కూర్చోబెట్టుకొనే తను రాయవలసిన జాబులో లేదా ఏ పత్రికకో రాయదలచుకున్న వ్యాసాన్నో రాసుకుంటూ పోవడం చేయగలరు. రాసిన కార్డునో, చేసిన రచననో వెంటనే ఇంటికి సమీపాన వున్న తపాలా పెట్టెలో వేసి ఆయాసపడుతూ వచ్చి కూర్చుంటారు. ఆయన నుంచి ఏవైనా రెండు మాటలు రాలడం అప్పుడే!

అలాంటప్పుడు నాలాంటి వాడికి 'సత్కాలక్షేపం' - కెవిఆర్ మాటల్లోనే - శారదమ్మగారే! డైనింగ్ టేబుల్ వద్ద తిష్ఠవేసి చేగోడీలో, పకోడీలో నముల్తూ రేడియోలో విన్న శాస్త్రీయ లేదా లలిత సంగీత కార్యక్రమాలనో లేదా ఏ పాత సినిమాలోనో................

  • Title :KVR Smruthilo
  • Author :KVR
  • Publisher :KVR Sharadamba Smaraka Kamiti
  • ISBN :MANIMN4476
  • Binding :Papar back
  • Published Date :MARCH, 2020
  • Number Of Pages :106
  • Language :Telugu
  • Availability :instock