₹ 100
అనాదిగా స్త్రీలు నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలు అందరికి తెలిసినవే! "ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం" అంటూ విన్న కబుర్లు చెప్పినా...... స్త్రీలు ఇప్పటికి "సెకండ్ క్లాస్ సిటిజన్లు" గానే పరిగణింప బడుతున్నారు. అందుకే విద్య, ఉద్యాగాలలో సామాజికంగా వెనకబడిన బలహీన వర్గాలతోపాటు స్త్రీలకు కూడా రిజర్వేషన్లు కావాలని స్త్రీలతో పాటు కొందరు పురుషులు కోరుకునే పరిస్థితి వచ్చింది.
చాల మంది దృష్టిలో స్త్రీల వెనుకబాటుతనానికి, అణచివేతకు కారణాలు వారికీ ఆర్ధిక స్వాలంబను లేకపోవటమేనని, స్త్రీలు పురుషులతోపాటు సంపాదించి తమ కాళ్లమీద తాము నిలబడే స్థితిలో ఉంటె "సమానత్వం" దానంతట అదే వస్తుందనుకుంటున్నారు.
నేడు స్త్రీలు తమ విద్యార్హతలను బట్టి వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. అంతమాత్రాన స్త్రీలకు "ఆర్ధిక స్వాతంత్ర్యం"వచ్చినట్లేనా?
-డా|| పరిమళా సోమేశ్వర్.
- Title :Ladies Special
- Author :Dr Parimala Someswar
- Publisher :Jayanthi Publications
- ISBN :MANIMN0766
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :104
- Language :Telugu
- Availability :instock