కన్నీళ్లు పెట్టించే రాజనాల జీవితం
అవి తెలుగునాట మద్యనిషేధం అమలులో ఉన్న రోజులు. మందు దొరుకుతుంది కానీ ఆ మందును గొంతులోకి పంపేందుకు ఓ నీడ కావాలి. కొంత మంది జర్నలిస్టు మిత్రులకు ఆ సమయంలో యూసుఫ్గూడలోని సారధి స్టూడియో వద్ద ఓ రేకుల షెడ్డు నీడ లభించింది. ఆ షెడ్డులో నివాసం ఉండే వ్యక్తి వీరికి మంచినీళ్లు, మందు తాగేందుకు గ్లాసుల వంటి మౌళిక సదుపాయాలు కల్పించేవారు.
అక్కడ మద్యం తాగి ఆ ఇంటిలో ఉన్న వ్యక్తికి ఒక క్వార్టర్ తాగించి వెంట తీసుకెళ్లిన బిర్యానీ ప్యాకెట్, జేబులో ఉంటే ఓ 50 రూపాయలు ఇచ్చేవాళ్లు.
ఇందులో పెద్ద విశేషం ఏముంది? ఆ కాలంలో చాలా మంది ఇలా చేసిన వారున్నారు. అనుకోవచ్చు. నిజమే ఏ కాస్త చీకటి కనిపించినా అక్కడ మందు తాగిన వాళ్లు, ఇప్పటికీ తాగుతున్న వాళ్లు చాలా మందే ఉండొచ్చు. కానీ ఆ రేకుల షెడ్డులో నివసించేది ఒకప్పుడు తెలుగు చలన చిత్ర సీమలో మకుటాయమానంగా వెలిగిపోయిన విలన్...
తెలుగు సినిమాల్లో విలన్లకు విలనిజం నేర్పిన నటుడాయన... హీరోలను మించి పాపులారిటీతో పాటు, హీరోలను మించి పారితోషికం తీసుకున్న నటుడాయన. దాదాపు పాతికేళ్లపాటు చిత్ర సీమలో ఎదురు లేకుండా నిలిచిన నటుడు. హీరోలకు పోటీ ఉందేమో కానీ విలన్గా ఆయనకు పోటీ లేకుండే. అతని కోసం హాలీవుడ్ సినిమా వాళ్లు సైతం మన దేశానికి వచ్చి సినిమా తీశారు. అతనే రాజనాల. మహోన్నత స్థితి నుంచి అధఃపాతాళంలోకి పడిపోయిన ఆయన జీవితం సినిమా వారికే కాదు, సంపదను నిర్లక్ష్యం చేసే వారికి, జీవితాన్ని ప్రేమించే అందరికీ ఒక గుణపాఠం.
రాజనాల తన చివరి రోజుల్లో హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్క రోజూ వచ్చేవారు. ఆయన పరిస్థితి చూసి పాత్రికేయులు జాలి పడేవారు. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ అంత సంపాదించిన వారు ఇలా ఎలా అయ్యారు? అనిపాత్రికేయుడు నామాల విశ్వేశ్వరరావు అడిగారు. నువ్వు రాయను అంటే చెబుతాను, 'ప్రపంచంలో నేను రుచి చూడని బ్రాండ్ మద్యం లేదు .. నేను తాగని బ్రాండ్ సిగరెట్ లేదు' అంటూ ఒక్క ముక్కలో చెప్పేశాడు. మీ తరం ఇలా ఎందుకు అయింది అనేది చెబితే తరువాత తరం వారికి ఉ యోగపడుతుంది కదా? రాయడం వల్ల నలుగురికి ఉపయోగమే తప్ప నష్టం లేదని................