• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Leap Frog

Leap Frog By Priyank Narayan

₹ 250

పరిచయం

'ఒక బనానా రిపబ్లిక్'

1904లో హోండూరాసన్ను వర్ణిస్తూ రచయిత ఓ హెన్రీ అన్నమాట. ఎగతాళిగానే అన్నప్పటికీ ఈ వర్ణన ఆ దేశానికి చక్కగా అతికింది.

మధ్య అమెరికాలోని ఈ ఉష్ణమండల దేశానికి మరో పార్శ్వం కూడా ఉంది. ఈ దేశంలో 6,000కు పైగా నాళమయ వృక్షజాతులున్నాయి. వర్షాధార అడవులకు ప్రసిద్ధి హోండూరాస్. ఇక అరటిపండ్ల విషయం చెప్పనవసరమే లేదు.

1996లో హోండురాస్ ప్రభుత్వం చొలుటెకా నదిమీద ఒక వంతెన కట్టాలనుకుంది. రెండేళ్ల తర్వాత ఒక జపాన్ కంపెనీ ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసింది. 484 మీటర్ల పొడవైన వంతెన. ఈ వంతెన ఒక ఇంజనీరింగు అద్భుతం. ప్రతి హోండూరాస్ పౌరుడికీ దీని నిర్మాణం ఒక గర్వకారణమైంది. స్థానికులు దీన్ని 'సూర్యోదయ వారధి' (Bridge of the Rising Sun) అని పిలుచుకున్నారు.

ఆ సంవత్సరం హోండూరాసన్ను 'మిచ్' అనే తుఫాను తాకింది. నాలుగు రోజుల్లో ఆరడుగుల వాన కురిసింది. సాధారణంగా ఇంతవాన కురవడానికి ఆరునెలలు పడుతుంది. విపరీతమైన విధ్వంసం జరిగింది. నదులు తీరాలు దాటి భూభాగాలను ముంచివేశాయి. 7000 మంది మరణించారు. హోండూరాస్లో ని అన్ని వంతెనలూ దెబ్బతినడమో, కూలిపోవడమో జరిగింది, ఒక్క చొలుటెకా వంతెన తప్ప..............

  • Title :Leap Frog
  • Author :Priyank Narayan
  • Publisher :Emesco Publications
  • ISBN :MANIMN5847
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :246
  • Language :Telugu
  • Availability :instock