లెనిన్ నేడు లేడూ,
చూడు జనంలో ఉన్నాడు!
* ఎన్ వేణుగోపాల్
సంపాదకులు, వీక్షణం
వ్లదీమిర్ ఇల్యీచ్ ఉల్యానొవ్ అనే ఒక సాధారణ వ్యక్తి, ప్రపంచ చరిత్రనే మార్చిన, చరిత్రలో మొట్టమొదటి సామ్యవాద రాజ్యం స్థాపించి, నిర్వహించిన లెనిన్ అనే అసాధారణ వ్యక్తిగా పరిణమించిన ఒక మహత్తర పరివర్తనను, పరావర్తనాన్ని ఎట్లా అర్థం చేసుకోగలం? నిండా యాబైనాలుగేళ్లు కూడా జీవించని, అందులోనూ జైలు శిక్షలూ ప్రవాసాలూ అనారోగ్యాలూ హత్యా ప్రయత్నాలూ చివరి ఏడాది పక్షవాతమూ తీసేస్తే అటూ ఇటూగా ఇరవై అయిదేళ్లు మాత్రమే సాగిన ప్రజా జీవితంలో ఒకానొక మనిషి సాధించగల అద్భుతాలను, సాధించిన అపురూప విజయాలను సూక్ష్మంగా ఎట్లా గ్రహించగలం? ఆ అర్ధశతాబ్ది చరిత్రకు, ఆ మాటకొస్తే ఆ అర్ధశతాబ్దిని రూపొందించిన రెండు శతాబ్దాల రష్యన్ చరిత్రకు, ఆ తర్వాత గడిచిన వంద...........