• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Lepaakshi Vasthu Silpa Chitralekhanalu

Lepaakshi Vasthu Silpa Chitralekhanalu By C Purnacahnd

₹ 300

మొదటి అధ్యాయం
 

చారిత్రక అంశాలు

లేపాక్షి, ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా. హిందూపూర్ తాలూకా కేంద్రానికి తూర్పుగా గిమైళ్ళ దూరంలో వున్న చిన్న గ్రామం. శాసనాలలోను, గ్రంధాలలోను దీనిని లేపాక్షి నగరం లేక పాప వినాశేశ్వర క్షేత్రమని పేర్కొన బడింది. స్కంధపురాణంలో యిది 108 శైవ క్షేత్రాలలో నొకటిగా వివరించబడింది. ఈ గ్రామానికి దక్షిణంగా వున్నకొండ కూర్మాకారంలో వుండడం చేత దీనిని కూర్మలిం అని కూడా అంటారు. లేపాక్షి విజయనగర ప్రభువుల కళాభిమానానికి మచ్చు తునకగా ప్రసిద్ధి చెందిన 'వీరభద్రస్వామి' ఆలయానికి నిలయం. ఈ ఆలయ ప్రాంగణంలో పావవినాశేశ్వర, రఘునాధ్, వీరభద్ర, కాళి మొదలయిన ఆలయాలున్నాయి. విజయనగర శిల్పాలకు, వర్ణ చిత్రాలకు యిది ప్రసిద్ధ కళానిలయంగా చెప్పవచ్చు.

శాసనాధారాలు :

శాసనాల ప్రకారం లేపాక్షి అనే గ్రామం పెనుగొండ రాజ్యం లోని సదలి వెంఠే భాగంలో రొడ్డనాడు అనే చిన్న విభాగంలో వుంది. పెనుగొండలో దొరికిన శాసనాలతో లేపాక్షి గురించి వివరించబడింది. అప్పట్లో లేపాక్షి గొప్పకీర్తి కలిగి వుండటమే గాకుండా స్థల వినాగానికి మఖ్య స్థావరంగా కూడా వుండేది. రొడ్డనాడు లోని స్థలాలలో తేసాక్షి స్థల విభాగం చాలా ముఖ్యమైంది. అప్పటి పెనుగొండ రాజ్యమంటే యిప్పటి అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్, పెనుగొండ, మదక సిర తాలూకాలు, పై మూడు తాలూకాలతో అక్కడక్కడ లభించిన శాసనాల వలన నాటి పెనుగొండ, వేపాక్షిల స్థితిగతులు తెలుస్తున్నాయి.

ఇక్కడ దొరికిన తొలి శాసనాల ప్రకారం హిందూపూర్, మగక సిర తాలూకాలను నొలంబరాజులు పాలించారు. వీరు గంగరాజులు, రాష్ట్ర కూటులు, చోళులు, పశ్చిమ చాళుక్యుల క్రింద సామంతులుగా............

  • Title :Lepaakshi Vasthu Silpa Chitralekhanalu
  • Author :C Purnacahnd
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN5113
  • Binding :Papar back
  • Published Date :2024
  • Number Of Pages :215
  • Language :Telugu
  • Availability :instock