లైఫ్ డివైన్
భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో శ్రీ అరవిందో రాసిన 'ద లైఫ్ ' డివైన్' అనే పుస్తకం ఒక నూతన వేదముగా, ఒక సైంటిఫిక్ రెలిజియన్కు, వైజ్ఞానిక అధ్యాత్మికతకు ఆధారశిలగా చాలా చాలా ప్రచారం పొందనున్నది. 'ద లైఫ్ డివైన్' గురించి చదువుకునే ముందు అసలు లైఫ్ డివైన్ అధ్యయనం చెయ్యటానికి మనకు కావలసిన అర్హతలు ఏమిటి? ఆ అర్హతలు ఒకవేళ మనలో ఉంటే వాటిని ఇంకా బాగా ఎలా అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే ఎలా మన జీవితంలో నాటుకుని పెంపొందింప చేసుకోవాలి అనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకుందాం అంటే లైఫ్ డివైన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం.
'లైఫ్ డివైన్' గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. స్పిరిట్యులిజమ్ అనేమాట ఈనాడు చాలా భ్రష్టు చెందింది. జీవితం మీద లేనటువంటి వాళ్ళు కఠోపనిషత్తులో చెప్పినటువంటి అనుభవించే శక్తి లేకపోయాక,..................