₹ 400
జీవితం ఒక passing show లాంటిది!
ఇందులో పాల్గొనే పాత్రధారుల జయాపజయాలతో, సుఖదుఃఖతో నిమిత్తం లేకుండా ఈ show సాగిపోతూనే వుంటుంది! ఇంతవరకు గడచినా నా జీవితం కూడా ఇదేవిధంగా సాగింది!
నా జీవితాశయాల్ని, లక్ష్యాల్ని సాధించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులకీ, ఆశాభంగాలకి లోనయ్యాను.
అదేక్రమంలో చెప్పుకోదగిన విజయాల్ని సాధించాను!
81 సంవత్సరాలు నిండాయి!
82 నడుస్తోంది.
ట్రైన్లో ప్రయాణం చేస్తున్నపుడు, వెన్నకి వెళ్ళే స్టేషన్లలా, 81 సంవత్సరాలు వెన్నకి వెళ్లాయి! వర్షం వచ్చే ముందు చీకటి పడుతున్నప్పుడు, లైట్లున్న గదుల్లోకి మూకుమ్ముడిగా జొరబడి, మనుషుల్ని ముసురుకునే రెక్కల పురుగులకి మల్లె .. ఏవేవో ఆలోచనలు, భావోద్వేగాలు గతించిన జీవితపు జ్ఞాపకాలు, అనుభూతులు నన్ను ముసురు కొంటున్నాయి!
అవి తప్పించుకోడానికి వీలయినవా?
కావు కదా-
అందుకే వాటినన్నిటినీ యథాతథంగా పొందు పరిచిన ఈ నా ఆత్మకథ వినోదాత్మకంగానూ, విజ్ఞాన దాయకంగాను ఉందని పాఠకులు భావిస్తే అంతకు మించిన Reward నాకింకేం వుంటుంది ?
- డి ఎ సుబ్రహ్మణ్య శర్మ
- Title :Life is Like That
- Author :D A Subramanya Sarma
- Publisher :Anupama Publications
- ISBN :MANIMN1935
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :476
- Language :Telugu
- Availability :instock