ప్రశంస.
పురాతన భారతీయవిజ్ఞాన పటిమ ఇటీవలివరకు భారతీయుల మయ్యు మనకు తెలియరాకుండుటకు కారణము లనేకములున్నవి. పాశ్చాత్య పరిశోధకులు బయలు వెడలి యక్కడక్కడ శిధిలములై పడియున్న వ్రాతగ్రంధములను భూస్థాపితములగు శాసనములను వెలికితీసి విమర్శించి నంతటినుండీ యు, వారికి భారతీయులయెడ గౌరవా దరములు గలుగజొచ్చినవి. వారివిమర్శనములు ప్రకటింపబడి నప్పటి నుండియే మనకు మనపూర్వుల సర్వతోముఖ పాండిత్యము దెలి యు టకు వీలైనది. ప్రాచీన భారతీయులలో నఖండ విజ్ఞానసంపన్ను లగు మహనీయు లనేకులున్నారు. అట్టివారలలో సిద్ధాంతశిరోమణికర్త యగు భాస్కరుడొకడు, అర్ధశాస్త్రవిజ్ఞానముందు చాణక్యుడెట్టికీ ర్తి వహించి మించెనో గణిత గ్రహగణిత శాస్త్రవిచారమందు భాస్కరు డంతప్రతిభంగాంచెను.
సిద్దాంత శిరోమణి యొక యపూర్వ గ్రంధము. ఇందు అంక గణిత బీజగణిత గ్రహగణిత విధానములు సులలితమగు సంస్కృత భాషలో శ్లోకరూపమున వర్ణింపబడియున్నవి. ఈ గ్రంధము ను విమ ర్శించిన పాశ్చాత్య పండితులు చలవకలన (Differential Calculus) గురుత్వాకర్ష ( Law of Gravitation)ణాది నవీన సిద్ధాంతములకు బీజములీగ్రంధమునందుసూచితములై యున్న వనినిర్థారించియున్నారు. సిద్దాంత శిరోమణియందలి అంకగణితాధ్యాయమును గ్రంధకర్త లీలా వతీయని పేర్కొనెను. ఇందలి శైలి కడుసరళమై లాలిత్యముగ నుండుటచే నీనామము సార్ధక మైనది. ఇందు అనేక గణితవిధానములు సంగ్రహమ:గ వర్ణింపబడియున్నవి. ఇందు అంకగణితమార్గములే కాక ఉచ్ఛబీజగణితమును సంబంధించిన శ్రేఢీ, కుట్టక, అంకపాళా..............