పంజరం విడిచిన పావురాలు
ఆగ్రహంతో అరుణారుణమైన పూర్వభాగానదీ (East River) జలాలు సుళ్ళు తిరుగుతూ, పరవళ్ళు తొక్కుతూ వైచె నగరాన్ని అధిగమించి, కాంటన్ లోని బొకాటైగ్రిస్, పెరల్ నదీడెల్టాలకు అభిముఖంగా శరవేగంతో ప్రవహిస్తూ ఉన్నాయి. అది 1959 సెప్టెంబరు నెలలో ఆఖరు వారం. మూడురోజుల బట్టీ ఎండ ప్రళయంగా వున్నది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. భూమి యావత్తూ సెగలు కక్కుతూ వున్నది. ఆ వేడికీ, తాపానికి తట్టుకోవడమే కష్టంగా వున్నది.
చౌ నగరం ఈ మధ్యనే రెండు మహావిపత్తుల నుంచి ఎలాగో బయటపడింది. జూన్ లో పెద్దపెట్టున వరదలు వచ్చాయి. ఆగస్టులోనేమో పంటలన్నీ సర్వనాశనమైనాయి.
వైచౌలో జనాభా రెండున్నర లక్షలు. ఆ రాష్ట్రంలో కాంటన్ తరువాత ఇదే పెద్దపట్టణం. చౌకు పశ్చిమాన దాదాపు అరవై మైళ్ళలో కాంటన్ వున్నది. ఈ రెండుపట్టణాలను ఒక రైలుమార్గం కలుపుతూవున్నది. ప్రధాన కూడలి అయిన కాంఫర్ వద్ద ఒక చిన్న రైలుమార్గం వచ్చి, కాంటన్- కౌటాన్ రైల్వేలో కలుస్తున్నది. ఇక్కడికి దక్షిణంగా యాభై మైళ్ళలోనే వున్నది హాంగ్కాంగ్ నగరం.
చౌపట్టణ ప్రాంతంలో కమ్యూన్ల ఏర్పాటు ఆ అక్టోబరు 15 కల్లా పూర్తి కానున్నట్టు ఆ రోజు ఉదయమే రేడియో ప్రకటించింది. అయితే, అసలే నిర్లిప్తంగా వున్న ప్రజలు ఈ వార్తవిని ఉలకలేదు - పలక లేదు; తమకేమీ పట్టనట్టు విని ఊరు కున్నారు. కడచిన జూన్ నెలలో పంటలన్నీ పాడై, జనం అల్లాడిపోయారు. అలాగే పొకోవద్ద ఆనకట్టలన్నీ పూర్తిగా మరమ్మతులు చేసుకోవలసి వచ్చినందున, ప్రజలు నానా అగచాట్లు పడ్డారు. కాని, ఇప్పుడీ కమ్యూన్ల ఏర్పాటు నగరంలో ప్రజా జీవితాన్ని సరిదిద్ది మెరుగుపరుస్తుంది. నగరంలో ప్రతి పురుషుడిపైన, ప్రతి స్త్రీపైన, ప్రతిశిశువు పైన కూడా దీని ప్రభావం కనిపించి తీరుతుంది. లూషాన్ సమావేశంలో అగ్రనాయకత్వం చేసిన నిర్ణయం ఇది. ఇక దీనికి తిరుగులేదు. ఈ విషయంలో ఎట్టి భయ సందేహాలకు,...............................