జ్ఞాపకాల దొంతరలు వారి గుండెలను ద్రవింపజేసేవి. అయినప్పటికీ క్లింట్ తల్లిదండ్రులు ముల్లపరంబిల్ థామస్ జోసెఫ్, చిన్నమ్మ జోసెఫ్ ఆ జ్ఞాపకాల పెట్టెను తెరవాలనే కోరికను అణుచుకునేవారు కాదు. వారిని కదిలిస్తే భరించలేని వేదన, అంతేలేని ఆవేదన కట్టలు తెంచుకుని మాటల్లోకి ప్రవహించేది. ఒకరు మరచిన సంగతులను మరొకరు వివరిస్తూ మాటల మధ్య నిశ్శబ్దాన్ని పూరించేవారు.
చిన్నమ్మ భుజాల మీద కూర్చునేది లక్ష్మి కుట్టి అనే చిలుక. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మి కుట్టికి, అప్పుడే బిడ్డను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న చిన్నమ్మ తానే అమ్మగా మారి పెంచింది.
క్లింట్ తల్లితండ్రులు జరిగిన సంగతులన్నీ చెబుతుంటే, అవన్నీ తాను ఇదివరకే విన్న కథలైనా, తన చిలకపచ్చని ఈకలను సవరించుకోవడం ఆపేసి మరీ శ్రద్ధగా వినేది లక్ష్మి కుట్టి.
కొన్ని కథలంటే!
విన్న ప్రతిసారీ అవి మనల్ని అచ్చెరువొందేలా చేస్తాయి.
ఎన్నిసార్లువిన్నా ఈ కథలు మన జటిలమైన జీవిత గమనంలో అగుపడే అందమైన దృశ్యాలనూ, దాని అశాశ్వత స్వభావాన్నీ మనకు అవగతం చేస్తూ,
ఆలోచింపజేస్తాయి.
జోసెఫ్, మరియు చిన్నమ్మలకు 19 మే 1976న ఏకైక సంతానంగా ఎడ్మండ్ థామస్ క్లింట్ జన్మించాడు.
అమెరికాలోని మిడ్- వెస్ట్ ప్రాంతానికి తనున్న చోటు చాలాదూరంలో ఉన్నప్పటికీ జోసెఫ్ కౌబాయ్ సినిమాలు విపరీతంగా ఇష్టపడేవాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత, నటుడు, మరియు నిర్మాత క్లింట్ ఈస్టుడ్.........