డీహ్యూమనైజేషన్
డీహ్యూమనైజేషన్! డీహ్యూమనైజేషన్!
గాజుసీసా గాజుసీసా
రక్తంతో నిండిన సెలైన్ సీసా మనిషి
నగరం మీదెవరో పగలగొట్టారు.
మానవదరహాస మహాకాశ పతాకంలో నిప్పులుపోసి
నగరం నడిబొడ్డున ఆవిష్కరించారు.
డీహ్యూమనైజ్ డీహ్యూమనైజ్
మనిషి నాడీ మనిషికి అందదు.
నా కళ్ళు నా దగ్గరలేవు
నా కాళ్ళు నా దగ్గరలేవు
నా చేతులు
ఎక్కడ? ఎవడి జేబులో?.............