పొలాల కల
ప్రతి పండగా కళకళతో పాటు
ఒక కలను కూడా వెంట తెస్తుందా?
ఈ ఉగాది తెచ్చిన కల పేరు
రాజధాని
తొలకరి మబ్బుమీద మబ్బల్లే కల
తూరుపు వెలుగునంతా మింగిన కల
స్వప్నచ్ఛాయల్లో మూలాలేవో కదలబారతా -
పొలాలు అరూపాలవుతా అపురూపాలవుతా -
కోటిరూపాయల నోటొక్కటి
పది ఆమడ పంటచేల మంచెమీద
రెపరెపలాడతంది
పైరగాలుల పరిమళాల్ని పరిహసిస్తంది.
రైతు ఇంటి తలవాకిలికి
ఏడు రంగుల వరదగూడు వేలాడదీస్తంది.
తరతరాలు ఈ కందకాల్లో పారిన
నల్లరేగడిలో ఇంకిన
నా తండ్రుల తాతల ముత్తాతల
చెమటకాల్వల విలువెంత?
బెట్ట దీసిన చేల నెర్రెల్లో దిగబడి మెలి
దిరిగిన కాళ్ల తీపుల లెక్కెంత?....................