అన్నదాత
- వైబోయిన సత్యనారాయణ
చిరునామా:
వైబోయిన సత్యనారాయణ,
ఇంటి నెంబర్ 15-9-562,
రోడ్ నెంబర్: 1, కవిరాజానగర్, ఖమ్మం,
తెలంగాణ - 507002.
మొబైల్: 9490368609.
నేను పుట్టింది. పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురం (చిన నింద్రకాలను) లో 1960 వ సంవత్సరం జూలై 17న, కానీ పెరిగిందీ, ఎదిగిందీ, ఇంటర్ వరకూ చదివిందీ (1966-78) నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, హిల్ కాలనీలో, ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజీఎన్నార్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీయస్సీ ఎలక్ట్రానిక్స్ (1979-82) చదువుకున్నాను.
డిగ్రీ చదువుతుండగానే, డిగ్రీ రెండవ సంవత్సరం వేసవి సెలవుల్లో టెలికాం డిపార్టుమెంటులో షార్ట్ డ్యూటీ టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం వచ్చింది. 1983 డిసెంబర్ 17న భద్రాచలం టెలిఫోన్ ఎక్చేంజ్లో జాయిన్ అయ్యాను. అక్కడే దాదాపు పదిహేను సంవత్సరాలు 1998 మే 31 వరకూ పనిచేసాను.
1988 ఫిబ్రవరి 18న భద్రాచలంలో ఆవిర్భవించిన 'సాహితీ గౌతమి' కి వ్యవస్థాపక ఆర్గనైజర్ 1992 ఆగస్టు వరకూ పనిచేసాను. 1992 - 98 మధ్య ఆ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసాను. 1989 మార్చి 24న ప్రారంభించబడిన మనదేశపు మొదటి ఎఫ్ ఎం రేడియో స్టేషన్ కొత్తగూడెం కేంద్రం ద్వారా ప్రసారమయిన మొట్టమొదటి కథ, నేను రాసిన 'పోతరాజు ' కథ. పదికి పైగా కథలు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి.
నేను 2020 సంవత్సరం జనవరి 31 వ తేదీన బీఎస్ ఎన్ ఎల్ లో జేటీవోగా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. ఇప్పుడు పూర్తిగా నా సమయాన్ని సాహిత్యానికే వెచ్చిస్తున్నాను.
ఇప్పటివరకూ అయిదు పుస్తకాలను వెలువరించాను. అవి
'స్వరగతులు మరియు జయ నారసింహా' నవలికల పుస్తకం, 'పోతరాజు' కథల పుస్తకం. 'వసంత పంచమి మరో రెండు నవలికలు' పుస్తకం. 'అమ్మను చూడాలి' నవల. 'సదువు చెబుతవ సారు' నవల. పోకెట్ ఎఫ్ ఎం ఆడియో ఛానల్లో ప్రసారమైన 'కలయా నిజమా' డైలీ సీరియల్లో చివరి ఎనభై ఒక్క ఎపిసోడ్స్ నేనే రాసాను. ప్రస్తుతం ప్రతిలిపి యాప్లో రెగ్యులర్గా రచనలను చేస్తున్నాను.......................