అంటార్కిటికా పర్యటనకు వెళ్లే ముందు అక్కడి భౌగోళిక పరిస్థితుల గురించి, వాతావరణం గురించి, పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందామని తెలుగులో పుస్తకాల కోసం ప్రయత్నించాను. కాని ఎక్కడా లభించలేదు. చివరికి ఆన్లైన్ కార్డ్ అమెజాన్లోనూ వెతికితే కూడా ప్రయోజనం లేకపోయింది. అయితే గూగుల్, వికిపీడియాలో మాత్రం కొంత సమాచారం లభించింది. కాని నాకు కావాల్సిన వివరాలు వీటిలో లభించలేదు. ఇక సామాజిక మాధ్యమాల్లో మరీ ముఖ్యంగా యూట్యూబ్లో కొందరు సాగించిన యాత్రలకు సంబంధించిన వీడియోలు మాత్రమే ఉన్నాయి. నాకు కావాల్సిన వివరాలు లేవు. దాంతో ఆ వీడియోలు కొంతమేరకు మాత్రమే ఉపయోగపడ్డాయి.
ఈ నేపథ్యంలోనే అంటార్కిటికాకు సంబంధించిన సమాచారంతో తెలుగులో పుస్తకం తీసుకురావాలని ఆలోచించాను. అందులోనూ మా యాత్రకు సంబంధించిన విశేషాలతో పుస్తకం వేయాలని, ఇందుకోసం కొందరు మిత్రులు మరీ ముఖ్యంగా పొనుగోటి కృష్ణారెడ్డి, మాచిరెడ్డి శివప్రసాదరెడ్డి, మా హసన్ అరుణ్ మేము వెళ్ళక ముందునుంచీ............