అనామిక
- గడ్డం దేవీప్రసాద్
హఠాత్తుగా పెద్ద వర్షం కురవడంతో రోడ్డుపై నడుస్తున్న నేను పరుగెత్తి ఓఇంటి తలుపు దగ్గరగా వెళ్ళి నిలుచున్నాను. తల తడవలేదు కానీ వర్షం ఏటవాలుగా పడుతున్నప్పుడు ప్యాంటు తడుస్తోంది. పూణేలో ట్రైనింగ్ కోసం వచ్చిన నేను మధ్యాహ్నం నుండి సెలవు ఇవ్వడంతో ఇక్కడి ఒక పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న గౌతమ్ అనే మిత్రునితో కలిసి అతని బండిపైన తిరుగుతూ ఓషో ఆశ్రమం, ఆగాఖాన్ ప్యాలస్ చూసి దగ్గుషేత్ గణేష్ మందిరానికి వచ్చాము. ఇంతలో గౌతమ్కు వాళ్ళ ఎస్.ఐ. నుండి ఫోన్ వస్తే త్వరగా వస్తానని చెప్పి వెళ్ళాడు.
"అందరి ఆ! భారీ బారిష్ హెరాహీ హై ఇస్తే అభి హిట్ న హెూనే దో” లోపలికి రండి. వర్షం ఎక్కువగా వస్తోంది. ఇది ఇప్పట్లో తగ్గదు) అంటూ ఒకామె తలుపు తీసి లోనికి రమ్మని చెప్పింది. నేను తప్పనిసరి పరిస్థితిలో లోనికి వెళ్ళాను.............