₹ 50
"మడేలు మిట్ట కతలు" పేరు చదవగానే, గోదావరి గాథలు, అమరావతి కథలు, చిన బ్బకతలు , మిట్టూరోడికతలు, పెన్నేటి కతలు, దర్గామిట్ట కతలు వంటి పుస్తకాలన్నీ స్మృతిలోకి వచ్చాయి. "పెన్నేటి కతలు" నా కథలే అన్నారు రామకృష్ణారెడ్డిగారు. నామినీకథలు కూడా అలాంటివే. స్వీయానుభవాత్మకాలు.
చాకలి వృత్తి జీవుల జీవనపోరాటం ఈ కతల వస్తువు. అది వాళ్ళ శ్రామిక సంస్కృతిలో కలిసి అత్యంత వాస్తవికరూపం తీసుకుంది. కథలోని అనుభవాలు ఆశు పద్దతిని జీర్ణం చేసుకున్న లిఖితపద్ధతిలో రాయబాడ్డాయి. రచయితకు సామజిక చరిత్ర దాని మూల సూత్రాలు కారతలమాలకాలు .
గ్రామీణ భారతీయ జీవితంలో చాకలి, మంగలి, మాల, మాదిగ, కుమ్మరి , వడ్రంగి, గొల్ల, బోయ వంటి శ్రామిక కులాల పాత్ర చరిత్రత్మక మైనది. ప్రతివృత్తి మానవ జీవితంలో పుట్టకనుండి మరణందాకా ఎదో ఒక రూపంలో ప్రాధాన్యం వహిస్తూనే వుంటుంది.
- Title :Madelumitta Kathalu
- Author :Vinjamuru Masthanbabu
- Publisher :Charvaka Kalapitam
- ISBN :MANIMN1087
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :160
- Language :Telugu
- Availability :instock