ఉపోద్ఘాతం (Preface)
దేశంలో 11.4 శాతం ప్రజలకు మధుమేహం, 15.3 శాతం మంది మధుమేహ పూర్వ (ప్రిడయాబెటిక్) స్థితిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 10 నుంచి 14.9% మంది ప్రిడయాబెటిక్ స్థితిలో ఉన్నారు. 30% మందికి పైగా బి.పి., 25% మందికి పైగా స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్ లో తెలుగు రాష్ట్రాలు రెడ్ జోన్లో ఉన్నట్లు ఐసిఎంఆర్ తాజాగా విడుదల చేసిన 'ఇండియాస్ మెటబాలిక్ హెల్త్ రిపోర్ట్' వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో అసాంక్రమిక (Non com- municable Diseases) వ్యాధుల భారం ఎక్కువగా ఉంది. మధుమేహం పట్టణ ప్రాంతాలల్లో 16.4%, గ్రామాల్లో 8.9% ప్రబలినట్లు నివేదిక తెలిపింది.
దేశంలో 28.6% మంది ఊబకాయంతోను, 35.5% బిపితోను, 24% మంది హైబ్లడ్ కొలెస్ట్రాల్తోను బాధపడుతున్నారు.
మధుమేహం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా, పుదుచ్చేరి, కేరళ ప్రథమ స్థానాల్లో ఉన్నాయంటే దానికి కారణం విచ్చలవిడి జీవనశైలి అని మనకర్థమవుతుంది. పిల్లల్లో డయాబెటిస్ పెరుగుతోంది
డయాబెటిస్ బారిన పడుతున్న పిల్లల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. 1990తో పోలిస్తే 2019లో చైల్డ్ డయాబెటిస్ కేసుల సంఖ్య 39.4% పెరిగిందని తెలిపింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 2,27,580 డయాబెటిస్ కేసులు నమోదయ్యాయని, 5,390 మంది పిల్లలు ఈ వ్యాధి కారణంగా చనిపోయారని పేర్కొంది. ఈ కేసులు, మరణాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగించే అంశం..............