ఇల్లు ఇల్లాలు, పిల్లలు ఒక ఆంధ్రా బ్యాంక్!
అవును. ఈ నాలుగింటి చుట్టూ మాత్రమే పరిభ్రమించిన ఒక సామాన్య బ్యాంకు ఉద్యోగి నిజాయతీ జీవిత కథ ఇది.
ఈ పుస్తకం లోకి ప్రవేశించే ముందు ఈ ముందుమాట తప్పనిసరిగా చదవండి. ఆ వెనుక ఈ పుస్తకం చదవాలా వద్దా అని నిర్ణయించుకోండి.
నా చిన్నతనంలో ఒక జానపద కథ విన్నాను. పూర్వం ఒక చిన్న రాజ్యంలో రాజు ఒక మూఢ శాసనం చేశాడు. అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ పని చేయలేరు కనుక, వారిని పోషించడం వృథా అనీ, వారిని నగరానికి దూరంగావున్న లోయలో వదిలివేయాలి అనీ, దానివల్ల 60 సంవత్సరాలు నిండిన అందరూ లోయలోకి చేరిపోయి సరి అయిన తిండి లేక బాధపడుతూ దిక్కులేని చావు చచ్చేవారు.
ఒక రోజు ఒక వ్యక్తికి 60 సంవత్సరాలు నిండాయి, శాసనం ప్రకారం అతని కొడుకు అతనిని భుజాల మీదకు ఎత్తుకొని లోయలోకి తీసుకొని వెళుతుంటాడు. భుజాల మీద ఉన్న తండ్రి దోవలో ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులూ కోసి పడవేస్తున్నాడు. ఆ పని చూసిన కొడుకు తండ్రిని "ఎందుకలా చేస్తున్నావు నాన్నా! దారి గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి వద్దామనా?" అని అడిగాడు. దానికి తండ్రి "కాదురా! నువ్వు తిరిగి....................