• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Maha Nandi
₹ 325

మహానంది

సూర్యుడు తన వెచ్చటి కిరణాలతో తామరలకు గిలిగింతలు పెడుతూ, అద్దంలా మెరుస్తున్న విశాలమైన తటాకంలో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. గంటసేపటి నుంచీ, ఆగకుండా చెరువు అంచు చుట్టూ ఈదుతున్న నంది యాభయ్యో ప్రదక్షిణ పూర్తి చేసి వెల్లకిలా తిరిగాడు. నీలాకాశంలో నెమ్మదిగా కదులుతున్న తెల్లటి మబ్బులు ఎండలో వెండి ముద్దల్లా మెరుస్తున్నాయి.

గంటసేపు లయబద్ధంగా కదిలించిన కాళ్ళనీ, చేతుల్నీ కదలకుండా ఉంచి, నీటి మీద తేలుతున్నాడు నంది విశ్రాంతిగా. అతనికి తాతయ్యా, తండ్రీ ఇద్దరూ గుర్తొస్తున్నారు. తాతయ్య చిన్నప్పటి నుంచి తనకు నేలవ్యాయామం నేర్పించాడు! తండ్రి జలవ్యాయామం నేర్పించాడు! తాతయ్య నేర్పింది చెమటలు కక్కించే వ్యాయామం. తండ్రి నేర్పింది చెమటల్ని కడిగి, శరీరాన్ని శుభ్రం చేసే వ్యాయామం!

"చేతులకూ, భుజాలకూ, మెడకూ, తొడలకూ, పిక్కలకూ, పాదాలకూ, శరీరంలోని కండరాలన్నింటికీ చక్కటి శక్తిని ఇచ్చేది ఈతే!" అంటాడు తన తండ్రి రుద్రాక్షుడు! కామరూపరాజ్య సర్వసైన్యాధ్యక్షుడైన తన తండ్రి నిత్యమూ జల వ్యాయామానికి వస్తాడు. సూర్యోదయంతో ఈత ముగించి వెళ్తాడు. నిత్య జల వ్యాయామం ఆయన ఆరుపదుల వార్ధక్యాన్ని ఆమడ దూరంలో ఉంచింది! ఆయన మాట నిజమే. ఎండనూ, వాననూ పట్టించుకోకుండా తను చేసే జలవ్యాయామం తన కండరాలను ఇనుప కడ్డీల్లా మార్చివేసింది.

"భవిష్యత్తులో నీకు లభించబోయే రాజోద్యోగానికి శరీర దారుఢ్యం చాలా ముఖ్యం! శారీరక బలం సామర్ధ్యాన్ని ఇస్తుంది. సామర్థ్యం ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం స్థైర్యాన్నిస్తుంది. స్థైర్యం సాహసాన్నిస్తుంది. పుట్టి పెరిగిన దేశాన్ని సేవించడానికి ఇవన్నీ అవసరం!" అంటాడు నాన్న, జన్మనిచ్చిన తల్లికీ, జన్మించిన భూమికీ తేడా చూడడు నాన్న ఆయన................

  • Title :Maha Nandi
  • Author :Vakkantam Suryanarayanarao
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN5932
  • Binding :Paerback
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :310
  • Language :Telugu
  • Availability :instock