Logili Books

Short Stories

Maha Swetha Devi Kathalu

By Kalekuri Prasad

₹350
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Maha Swetha Devi Kathalu
Publisher
Hydrabad Book Trust
ISBN
MANIMN5077
Binding
Papar back
Published Date
2023 Reprint
Number Of Pages
359
Language
Telugu
Availability
In Stock
About this book

చోళీకే పీచే 

అనువాదం: కలేకూరి ప్రసాద్

'అక్కడేముంది?' అన్నది ఆ సంవత్సరపు జాతీయ సమస్యగా మారింది. పంటలు పండకపోవడం, భూకంపాలు. ఎక్కడ చూసినా ఉగ్రవాదులకీ, ప్రభుత్వ యంత్రాంగానికీ మధ్య ఘర్షణలు - ఫలితంగా మరణాలు; కులాంతర వివాహం చేసుకున్న నేరానికి ఒక జంటను హర్యానాలో తలలు నరికి చంపడం; నర్మదా డామ్ విషయమై మేథా పాట్కర్ తదితరులు చేస్తున్న అర్థం లేని డిమాండ్లు. వందలాదిగా జరుగుతున్న మానభంగాలు - హత్యలు - లాకప్లో చిత్రహింసలు వగైరా... వగైరా అంశాలన్నీ ఈ సమస్య ముందు అప్రధానాలై పోయాయి. అవేవీ వార్తా పత్రికల్లో ప్రముఖస్థానాన్ని ఆక్రమించలేకపోయాయి. అన్నిటికీ మించిన ప్రాధాన్యతను సంతరించుకున్న ఒకే ఒక అంశం... చోళీకే పీఛే - రవికె మాటున....

జాతీయ జీవనంలో ప్రాధాన్యం లేని అంశాలను ప్రాధాన్యం గల అంశాలు అణచి పారేస్తాయి - అదే నియమం. అందుకనే అక్కడ.. రవికె మాటున ఏముంది? అన్నది అతి ముఖ్యమైన సమస్య అయిపోయింది. భారతజాతి 'ఆత్మ'పెనునిద్దురలో మునిగిపోవడమే కాక అవసరమైనప్పుడు మేల్కొనగలదనడానికి ఇదే తార్కాణం.

ఈ విధంగా యావన్మంది ప్రజానీకమూ అక్కడేముందో తెలుసుకునే ప్రయత్నంలో మునిగి తేలుతున్నారు. జాతీయ ప్రసార సాధనాలు, సెన్సార్ బోర్డు, బ్రా వ్యతిరేక విముక్త మహిళలు, రాష్ట్రస్థాయి సంస్థలు, కేబుల్ టీవీ ఛానెల్స్ - కళ్ళమీద ఆకుపచ్చ షేడ్ వేసుకున్న మహిళా ఓటేరియన్ల సంస్థలు, అన్ని మతవర్గాలూ, ఇంకా రాజకీయ నాయకులు చాటుమాటుగా 'ఖల్నాయక్ ' కాసెట్లు వేసుకుని చూడటం పరిపాటయిపోయింది.................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?