• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mahabhagavatham 2nd part

Mahabhagavatham 2nd part By Nayuni Krishnamurty

₹ 270

కూర్మావతారం

ఆదిలో దేవదానవులకు పరస్పరం ఉన్న వైషమ్యంవల్ల తరచుగ యుద్ధాలు జరిగేవి. వాటిల్లో బలవంతులైన రాక్షసులదే పైచేయి. ఎందరో దేవతలు రాక్షసుల బలం ముందు తలలు వంచి ప్రాణాలు పోగొట్టుకొన్నారు.

శత్రువుల్ని నిగ్రహించలేక దేవతలందరూ గుమిగూడి వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం ప్రతీక్షించారు.

తన నిమిత్తం వచ్చిన దేవతల మీద కరుణించి శ్రీహరి వేయి సూర్యులు కరగి ఒక రూపుగా ఏర్పడినట్లు తేరిపార చూడడానికి అలవిగాని రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ కాంతితో విభ్రాంతులైన దేవతలకు ప్రణమిల్లడానికి పద్మనాభుడి పాదాలు కూడా కనిపించలేదు.

కొంతసేపటికి తెప్పరిల్లి హార కిరీట కేయూర కుండలాలతోను, కౌస్తుభంతోను, కౌమోదకీ శంఖచక్ర ధనుస్సులతోను మనోహరమైన శ్రీ విష్ణువు రూపాన్ని చూడగలిగి నమస్కరించారు.

"తండ్రీ! ఘటానికి మన్నువలె సృష్టికి మొదలు, నడుమ, తుది అన్నీ నీలోనే కనిపిస్తాయి. ఆత్మవిదులైన నరులు యోగవశతను పొందే ఓజో బుద్ధితో................

  • Title :Mahabhagavatham 2nd part
  • Author :Nayuni Krishnamurty
  • Publisher :Vijayavani Printers
  • ISBN :MANIMN4935
  • Binding :Papar Back
  • Published Date :2019 3rd print
  • Number Of Pages :442
  • Language :Telugu
  • Availability :instock