• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mahabharatam Sogasulu Sukshmalu

Mahabharatam Sogasulu Sukshmalu By Sakam Nagaraja

₹ 100

తింటే గారెలు – వింటే భారతం

-

మహాభారతం ఇందులో పద్దెనిమిది ఘట్టాలున్నాయి. నాగరాజ గారు 'నేను పిల్లల కోసం మహాభారతం రాశాను మేడం మీరు చదివి ముందు మాట రాయండి' అని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్య పోయాను. అందునా 80 పేజీలు రాశా నన్నప్పుడు యింకా ఆశ్చర్య పోయాను. 18 పర్వాల మహాభారతం ఎక్కడ, 80 పేజీలలో మహాభారతం ఎక్కడ? ఎలా వ్రాసి వుంటారు అనిపించింది.

వారు పుస్తకాన్ని తెచ్చి నాకు సమర్పించి నప్పుడు ఆ చిన్ని పుస్తకంలో ఏ ముంటుందబ్బా! అనుకొన్నాను. ఈ రోజు పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చదివాను.

ఆ 18 పర్వాలు చదివి వడబోసి అందులోని అరుదయిన, ముఖ్యమైన ఘట్టాలు పొందుపరచి ఎంతో సూక్ష్మంగా రాశారు. పుస్తకం అట్ట మీదే మహాభారతం క్రింద సొగసులు, సూక్ష్మాలు అని రాసి వుంది.

శకుంతల దుష్యంతుల వుదంతం నుండి మొదలుబెట్టి కుంతి దృతరాష్ట్ర మహారాజు దంపతులతో అడవి ప్రయాణం వరకూ రాశారు.

శకుంతల సౌందర్యానికి ముగ్ధుడయిన దుష్యంత మహారాజు ఆమెను వివాహమాడి తిరిగి తన రాజ్యానికి వెళతాడు. కణ్వ మహర్షి ఆదేశానుసారం, పుత్రుని తీసుకొని కోటి కలలతో దుష్యంత మహారాజు వద్దకు వెళ్లిన శకుంతలను దుష్యంతుడు ఎంత అవమానపరిచాడు!

ఏకలవ్యుడు ఎంతో దీక్షతో ద్రోణుడినే తన గురువుగా ఎంచుకొని అన్ని విద్యలూ నేర్చి, ఔననిపించుకున్న ఏకలవ్యునికి - అర్జుని అసూయ గ్రస్త మనసు వలన గురువుగా భావించిన ద్రోణుడు చేసిన ద్రోహం ఏమిటి!

పరాక్రమ వంతుడు, లోకవీరుడైన కర్ణుడు కేవలం తన తల్లిదండ్రులు ఎవరో చెప్పలేక, తను సూతపుత్రుడయినంత మాత్రాన నిండు సభలో ఎంత అవమానానికి గురయ్యాడు!...........................

  • Title :Mahabharatam Sogasulu Sukshmalu
  • Author :Sakam Nagaraja
  • Publisher :Sakam Shashikala
  • ISBN :MANIMN6627
  • Binding :Papar Back
  • Published Date :Oct, 2025
  • Number Of Pages :120
  • Language :Telugu
  • Availability :instock