వేదవ్యాస మహర్షి
మహాభారతమ్
ఆదిపర్వం
శౌనక మహర్షి నైమిశారణ్యంలో సత్ర యాగం చేస్తున్నాడు. ఆ యాగాన్ని చూడటానికి చాలామంది మహర్షులు వచ్చారు. సూత వంశానికి చెందిన ఉగ్రశ్రవుడు కూడా వచ్చాడు.
పురాణ కథల్ని వీనుల విందుగా చెప్పటంలో సూతుడు దిట్ట. నైమిశంలోని మహర్షులు సూతునికి అతిథి సత్కారాలు చేశారు. దర్భలతో నేసిన చాపమీద సూతుడు కూర్చున్నాడు. శౌనకుడు మొదలైన మహర్షులు ఆయన చుట్టూ చేరారు. ఎక్కడి నుంచి వస్తున్నావని సూతుని అడిగారు.
"మహర్షులారా ! పరీక్షిత్తు కుమారుడు జనమేజయ మహారాజు. ఆయన చేసిన సర్ప యాగానికి వెళ్ళి వస్తున్నాను. అక్కడ వ్యాసుడు రాసిన భారతంలోని కథల్ని వైశంపాయనుడు చెప్పగా విన్నాను” అన్నాడు సూత మహాముని.
"అయితే... ఆ మహాభారత కథనే మాకూ వినిపించు” అన్నారు మహర్షులు.......................