మహాత్ముల పరిచయము
విశ్వగురు పీఠాధిపతి
భగవాన్ శ్రీశ్రీశ్రీ విశ్వయోగి
విశ్వంజీ మహరాజ్
దివ్యాశీస్సులు
తెలుగులో ఇప్పటివరకు 500 మంది మహనీయులు, దత్త సంప్రదాయ మహాత్ముల గురించిన సంక్షిప్త సమాచారాన్ని గ్రంథరాజ రూపంలో తెలుగు జాతికి అందిస్తున్న రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి, పద్మజ ప్రసాద్ బేతనబొట్ల దంపతుల కృషి ఎంతో ప్రశంసనీయం, అభినందనీయం.
ఈ గ్రంథం ఆమూలాగ్రం అంతరార్థ, విశేషార్థ, యోగార్ధ సమ్మిశ్రితమై దత్తోపాసకులకు, సమస్త భక్తకోటికి విజ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రసాదించ గలదనుటలో సందేహం లేదు. ఈ గ్రంథ పఠన ఎంతోమంది మహనీయులు యొక్క సంక్షిప్త సమాచారాన్ని అందిస్తున్నది. ఇది దత్త గురు అనుగ్రహప్రదము, ఆనందదాయకం.
ఇటువంటి శక్తిమంతమైన “మహాత్ముల పరిచయం" గ్రంథ ఆవిర్భావానికి, ప్రచురణకు మూలకారణమైన రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బొడ్డుపల్లి, పద్మజ ప్రసాద్ బేతనబొట్ల దంపతులను హృదయపూర్వకంగా అభినందిస్తూ దివ్యాశీస్సులను అందిస్తున్నాను. ఇంకా ఇంకా ఇటువంటి శక్తిమంతమైన గ్రంథ రాజములు వీరి ద్వారా వెలువడాలని కోరుకుంటూ దివ్యాశీస్సులను అందిస్తున్నాను.
విశ్వగురురక్ష - సర్వజగద్రక్ష - ఓం శ్రీసాయిరాం - గురుదేవదత్త విజయోస్తు దిగ్విజయోస్తు - సర్వేజనా స్సుఖినోభవంతు లోకా సమస్తా స్సుఖినోభవంతు...............