• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mahojwala Samsmruthulu

Mahojwala Samsmruthulu By Siva Varma

₹ 150

సర్దార్ భగత్సింగ్

ఎవరో ఒక పంజాబీ మహాశయుడు నన్నూ, జయదేవ్ నూ కలుసుకోవడానికి కాన్పూరుకు వస్తున్నట్లు ఢిల్లీ నుండి ఒక మిత్రుడు ఉత్తరం వ్రాశాడు. మేము విప్లవ పార్టీలో చేరి కొంతకాలమే అయింది. కాన్పూరుకు వెలుపల కొద్దిమందికే మేము తెలుసు. లక్నో, అలహాబాదులకు చెందిన వారైతే ఆలోచించవచ్చు. కానీ ఈ పంజాబీ మహాశయుడు ఎవరు చెప్మా? "నేనున్న యమునాఘాట్ వద్ద ఇతనితో పరిచయమయింది. ఇతడు మీకు అత్యంత సన్నిహితుడు. ఏదో పని మీద కాన్పూరు వెళ్ళాలని చెప్పినందువల్ల మీ ఇద్దరి అడ్రసులు అతనికిచ్చాను. మిగతా విషయాలు అతడు నేరుగా చెపుతాడు" అని ఆ మిత్రుడు తెలిపాడు.

ఆ ఉత్తరం చదివి మాకు మా చెడ్డకోపం వచ్చింది. ఎట్లాంటి మనిషికి మా రహస్యమంతా వెల్లడిచేసి ఇక్కడకు పంపుతున్నాడో అని మేము కలత చెందాము. ఏమయినా అతడు ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరే వుంటాడు. మార్గమధ్యంలో వుండి వుంటాడు. అందువల్ల అన్నిటికంటే ముందు మేము మా గదులను సోదా చేసుకున్నాము. మా కాలేజీ పుస్తకాలు తప్ప, మిగతా పుస్తకాలనూ, కాగితాలనూ, ఉత్తరాలనూ మా గదుల నుంచి తొలగించేశాము. అప్పుడు మేము డి.ఎ.వి. కాలేజీ హాస్టలుకు చెందిన 'ఎర్రబంగళా'లో వుండేవారం. జయదేవ్ తనగదిలో మహాత్మాగాంధీగారి రాట్నమొకదాన్ని వుంచుకొన్నాడు. జాతీయ భావాలకు చిహ్నమైన దాన్నికూడా తొలగించేశాము. పంజాబీ మహాశయుడు మొదట జయదేవ్ను కలుసుకుంటే అతనికి నన్ను పరిచయం చేయకూడదనీ, ఒక వేళ అతడు మొదట నా వద్దకు వస్తే అతనికి జయదేవ్ను పరిచయం చేయకూడదనీ మేము నిశ్చయించుకున్నాము.

జాతీయ విప్లవ వీరుల మహోజ్వల సంస్కృతులు.........................

  • Title :Mahojwala Samsmruthulu
  • Author :Siva Varma
  • Publisher :Nava Chetan Publishing House
  • ISBN :MANIMN5701
  • Binding :Papar Back
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :176
  • Language :Telugu
  • Availability :instock